Begin typing your search above and press return to search.
జాకీ కంపెనీ పేరుతో టీడీపీకి జాకీలు...తోపుదుర్తి చెబుతున్నది ఇదే ..
By: Tupaki Desk | 22 Nov 2022 3:19 PM GMTఆయన వైసీపీలో నోరున్న ఫైర్ బ్రాండ్ ఎంపీ. పరిటాల ఫ్యామిలీకి కోట లాంటి రాప్తాడు నుంచి పంతం పట్టి గెలిచిన స్ట్రాంగ్ లీడర్. మంత్రి కావాలని ఆశపడ్డా జగన్ ఆయనను కరుణించలేదు. అయినా సరే పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మరోసారి తనదే అని జబ్బలు చరచే తోపుదుర్తి ప్రకాష్ రెడ్ది ఇపుడు ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన ఒక వార్తకు కౌంటర్ గా మీడియా మీటింగ్ పెట్టి మరీ చెడుగుడు ఆడేశారు.
అంతే కాదు, జాకీ కంపెనీ పేరు పెట్టి ఎత్తిపోయిన సంస్థానం టీడీపీకి జాకీలు వేయాలనుకుంటున్నారా అంటూ టీడీపీ అనుకూల మీడియాను ఏకేశారు. ఇంతకీ ఆయన చెప్పింది ఏంటి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే. అనంతపురంలో జాకీ అపెరల్ కంపెనీ గురించి ఒక ప్రముఖ పత్రికలో వార్తా కధనం ప్రచురితం అయింది. ఆ కంపెనీలో ఏపీలో తమ యూనిట్ పెట్టాలని అన్నీ రెడీ చేసుకుని చివరి నిముషంలో ఇక్కడ నుంచి తెలంగాణాకు వెళ్ళిపోవడాన్ని ఆ పత్రిక పేర్కొంటూ దాని వెనక లోకల్ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరి టార్చర్ ఉందని రాసుకొచ్చింది.
ఆ కంపెనీ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ఎన్ని ఇబ్బందులకు వేధింపులకు గురి చేశారో కూడా పూసగుచ్చినట్లుగా రాసింది. దాంతో తాము తట్టుకోలేమని భావించే జాకీ అపెరల్ కంపెనీని తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని సైతం అప్పగించేసి పెట్టుబడులను వెనక్కు తీసుకుని తెలంగాణా రాష్ట్రానికి షిఫ్ట్ అయిపోయింది.
దీని మీద ఇపుడు ఏపీలో అధికార విపక్షాల మధ్య అతి పెద్ద మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వచ్చినా వారికి సానుకూల వాతావరణం లేదని వేధింపులే చేస్తూ వెళ్ళగొడుతున్నారని విపక్షలు విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే జాకీ కంపెనీ వెళ్లిపోవడానికి కారణం తాము కాదంటూ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి మీడియా ముందుకు వచ్చి అంతా చెప్పుకున్నారు. పైగా జాకీ అపెరల్ కంపెనీని లూటీ కంపెనీగా ఆయన పేర్కొనడం విశేషం. అంతే కాదు, తమిళనాడు, కర్నాటకలలో ఆ కంపెనీఎ తన తయారీ యూనిట్లను కూడా మూసివేసిందని కూడా ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు.
తిరుపూర్ లో రెండు యూనిట్లు, బెంగుళూరులో రెండు యూనిట్లకు జాకీ అపెరల్ కంపెనీ మూత వేశారని చెప్పుకొచ్చారు. ఇది చాలదన్నట్లుగా జార్ఖండులోనూ మధ్యప్రదేశ్ లోనూ ఒడిషాలోని భువనేశ్వర్ లోనూ పరిశ్రమలు పెడతామని భూములు తీసుకుని ఏం చేస్తున్నారో ఆ పత్రిక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి వివరాలు సమాజానికి చెప్పదా అని ఎద్దేవా చేశారు.
పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ జాకీ అపెరల్ కంపెనీ పేరుతో భూములను ప్రభుత్వం నుంచి తీసుకోవడం ఒప్పందాలు కుదుర్చుకోవడం చేస్తోందని, మరి ఉత్పత్తి ప్రారంభించినవి ఎన్ని ఎక్కడ ఉన్నాయో కూడా చూడాలని అన్నారు. అలాగే 2017లో రాప్తాడులో కూడా ఈ సంస్థ భూములు తీసుకుందని మరి పరిశ్రమ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందని ఆయన నిలదీశారు.
తమ ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ వేరుగా ఉందని, భూములను ఎవరికి అయినా కారు చౌకగా ఉదారంగా ఇవ్వమని, అలాగే అయిదు కోట్లు విలువ చేసే భూములను అప్పనంగా పది లక్షలకు ఇవ్వమని చెప్పుకొచ్చారు. మార్కెట్ రేటుకే తమ ప్రభుత్వం పరిశ్రమలు పెట్టేవారికి భూములు ఇస్తుందని ఆ మీదట కనీసం పన్నెండు ఉత్పాదక సంవత్సరాలు పూర్తి అయిన మీదటే ఆ భూమి మీద వారికి హక్కు ఉండేలా చూస్తుందని ఆయన వివరించారు.
ఇక జాకీ అపెరల్ కంపెనీ వ్యవహారం చూస్తే పది రూపాయలు పెట్టుబడికి వంద రూపాయలు ఆదాయం కావాలన్నట్లుగా ఉంటుందని, అందుకే ఎక్కడా కుదరక వారు మూసుకుపోతున్నారని తోపుదర్తి విమర్శించారు. ఒప్పందాలు కుదిరితే పరిశ్రమలు వచ్చేసినట్లేనా అని కూడా ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పెట్టుబడుల సమ్మిట్స్ ని నిర్వహించి ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిలో పద్నాలుగు సంస్థలకు ఎందుకు భూములు టీడీపీ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మీ అమామ్యాలకు సెట్ కాకనే ఇవ్వలేదా అని నిలదీశారు.
ఇక జాకీ అపెరల్ కంపెనీ డీపీయార్ చూస్తే దశలవారీగా ఆరు వేల ఉద్యోగాలు ఇస్తామని అది కూడా ఆరేళ్ల కాల వ్యవధిలో అని చెప్పుకొచ్చిందని ఆయన వివరించారు. పెట్టుబడి కూడా 129 కోట్ల రూపాయలు అని ఆయన పేర్కొన్నారు. పద్ధతిగా సవ్యంగా పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించే వారికి తమ ప్రభుత్వం డోర్స్ ఎపుడూ ఓపెన్ చేసి ఉంటాయని అలా కాకుండా భూములు తీసుకుని దాని మీద ఏదో చేద్దామనుకుంటే కుదిరే సీన్ లేదని తేల్చి చెప్పారు.
తెలుగుదేశం పార్టీని జాకీలు పెట్టి లేపడానికే జాకీ అపెరల్ కంపెనీ పేరుని తెచ్చి టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేస్తోందని ఆయన విమర్శించారు. ఆ మీడియాకు దమ్ముంటే గతంలో టీడీపీ పెట్టిన సమ్మిట్స్ లో వచ్చిన పెట్టుబడులు ఎన్ని అని కూడా రాయలని కోరారు. నలభై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని నాడు టీడీపీ చేసుకున్న గొప్ప ప్రచారం వల్ల నరేంద్ర మోడీ ఏపీకి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని భావించారని కూడా ఆయన కొత్త మాట చెప్పారు. మొత్తానికి జాకీ కంపెనీ కాదు కానీ రచ్చగా ఉంది ఆంతా.