Begin typing your search above and press return to search.
ఇదెక్కడి దరిద్రం.. 11 కోట్ల టీకాల్ని వాడని ఆ 5 రాష్ట్రాలు
By: Tupaki Desk | 9 Dec 2021 5:00 AM ISTఓవైపు కరోనా ముప్పు ఎప్పుడు.. ఎలా విరుచుకుపడుతుందో అర్థం కాక చస్తున్న వేళ.. ఉన్న ఒకే ఒక్క అవకాశం.. ప్రజలకు టీకాలు వేయటం. వీలైనంత ఎక్కువగా వ్యాక్సినేషన్ జరిగితే.. రోగనిరోధక శక్తి పెరగటంతో పాటు.. కరోనాను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.
ఇలాంటివేళ.. రాష్ట్రాల వారీగా వ్యాక్సిన్ల పంపిణీ చేసిన కేంద్రం.. తాజాగా ఒక షాకింగ్ ప్రకటనను చేసింది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం విన్నంతనే నోట మాట రాని పరిస్థితి.
దేశంలో ఎన్ని టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి? ఏ రాష్టాల్లో టీకా వినియోగం సరిగా జరగలేదు? ఎవరి దగ్గర అత్యధిక టీకా నిల్వలు పేరుకుపోయాయి? లాంటి ప్రశ్నలకు తాజాగా సమాధానం లభించింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో దాదాపుగా 11 కోట్ల టీకా డోసులు నిల్వలు ఉన్నట్లుగా వెల్లడించారు. ఆ ఐదు రాష్ట్రాల్ని చూస్తే..
1. ఉత్తరప్రదేశ్
2. మహారాష్ట్ర
3. పశ్చిమ బెంగాల్
4. బిహార్
5. రాజస్థాన్
ఈ ఐదురాష్ట్రాల్లో భారీగా టీకా నిల్వలు ఉన్నప్పటికీ.. వాటినివేయకుండా పోగేసుకొని కూర్చున్నట్లుగా చెప్పాలి. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే ఒక్క టీకా డోసు కూడా వేసుకొనివారు 3.5 కోట్ల మంది ఉన్నారని తేల్చారు. బిహార్లో 1.89 కోట్లు.. మహారాష్ట్రలో 1.71 కోట్లు.. తమిళనాడులో 1.24 కోట్ల మంది ఉన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న మార్గాల్ని చూస్తున్న వేళ.. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంత ఎక్కువగా జరిగితే.. కొత్త వేరియంట్ ముప్పు అంత తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇలాంటి వేళ.. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా పోగుపడినట్లుగా కోట్లాది వ్యాక్సినేషన్లు ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆలస్యం కాగా.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇప్పటికైనా టీకాల నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.