Begin typing your search above and press return to search.

ఆ 9 మంది ముస్లిం పోలీసులు గడ్డం తీసేయాల్సిందే ...!

By:  Tupaki Desk   |   23 Nov 2019 11:02 AM GMT
ఆ 9 మంది ముస్లిం పోలీసులు గడ్డం తీసేయాల్సిందే ...!
X
భారతదేశం అనేక మతాలు, భిన్న సంస్కృతలకి నిలయం. మన ఈ దేశంలో ఎన్నో మతాల వారు, వారి ఇష్టాల మేరకు జీవనం కొనసాగిస్తున్నారు. దీనిపై ఎటువంటి అపేక్ష లేదు. కానీ , సమాజంలో ఒక భాద్యత గల ఉద్యోగం చేస్తున్నప్పుడు .. కొన్ని నియమాలని పాటించక తప్పదు. అది వారి వారి మతాలకి భిన్నం అయినా కూడా కొన్ని సార్లు పాటించకతప్పదు. ఇక ప్రస్తుత సమాజంలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమైంది. ప్రజల రక్షణ కోసం నిరంతరం విధి నిర్వహణలో ఉంటున్నారు.

ఇక పోలీసులు అంటే సమాజాన్ని మాత్రమే క్లీన్ చేయడం కాదు ..వారు కూడా అంటే క్లీన్ గా కనిపించాలి. ఈ మాటని అని అల్వార్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అనిల్ పారిస్ దేశ్‌ ముఖ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా ముస్లిం పోలీసులను గడ్డం పెంచకూడదని వాటిని వెంటనే కత్తిరించుకోవాలంటూ ఆదేశాలు జారీచేశాడు. అయితే , రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం.. 32మంది ముస్లింలు గడ్డం ఉంచుకోవచ్చంటూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, తొమ్మిది మంది మాత్రం గడ్డం కచ్చితంగా తీసేయాల్సిందేనంటూ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాలిచ్చాడు. అయన దీనిపై మాట్లాడుతూ ... పోలీసుల పనే కాదు, వాళ్ల యూనిఫామ్ కూడా సరిగ్గా ఉండాలని తెలిపారు.

అయితే , పోలీసులకు డిపార్ట్‌ మెంట్ హెచ్‍‌ఓడీ అనుమతితో గడ్డం పెంచుకోవచ్చనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారమే 32మంది ముస్లిం పోలీసులకు అనుమతినిచ్చారు. కానీ , ఆ 32 మంది లో ఈ తొమ్మిది మందికి మినహాయించి, మిగిలిన వారికి రూల్స్ మార్చలేదని ఎస్పీ వెల్లడించాడు. అయితే ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తమైతే, ఈ నిర్ణయం పై మరోసారి పునరాలోచిస్తామని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ దేశ్ ముఖ్ తెలిపాడు.