Begin typing your search above and press return to search.

మోడీ భ‌జ‌న స‌రే.. ఆ దేశాల్లో సీన్ అలా ఉండి ఉంటే.. ప‌రిస్థితి ఏంటి?

By:  Tupaki Desk   |   21 Jan 2023 2:30 PM GMT
మోడీ భ‌జ‌న స‌రే.. ఆ దేశాల్లో సీన్ అలా ఉండి ఉంటే.. ప‌రిస్థితి ఏంటి?
X
ఔను.. భార‌త్ చుట్టుప‌క్క‌ల ఉన్న దేశాలు.. ఇప్పుడు తీవ్ర ఆర్థిక‌, రాజ‌కీయ సంక్షోభంతో అల్లాడుతున్నాయి. పాకిస్థాన్‌, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, నేపాల్ మ‌న‌కు చుట్టుప‌క్క‌ల ఉన్న దేశాలు. అయితే.. ఇప్పుడు పాకిస్థాన్‌, శ్రీలంక దేశాలు రెండూ కూడా.. తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్నాయి. లంక గురించి అంద‌రికీ తెలిసిందే. గ‌త ఏడాది ఏకంగా అధ్య‌క్ష భ‌వ‌నాన్నిత‌గ‌ల‌బెట్టారు. ఇక‌, పాకిస్థాన్ ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు.

ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. తిండికి కూడా అల్లాడిపోతున్నారు. తాగేందుకు నీరు మాత్ర‌మే వీరికి ఉంది.. దీంతో పాకిస్థాన్ సాయం చేయాల‌ని కోరుతూ.. ప్ర‌పంచ దేశాల‌వైపు చేతులెత్తి అర్ధిస్తోంది.ఇక‌, ఇంత‌కు భిన్నంగా లేని బంగ్లాదేశ్ ప‌రిస్థితి కూడా ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. అయితే.. అక్క‌డ కూడా నిధుల అడ్జ‌స్ట్ మెంట్ కాక‌.. నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. ఇక‌, నేపాల్‌లో ఆర్థిక‌, రాజ‌కీయ సంక్షోభాలు రెండూ ఉన్నాయి.

వీటికి కార‌ణం.. మోడీ అనుస‌రిస్తున్న విధానాలేన‌ని.. గ‌తంలో మోడీ పాకిస్థాన్‌ను ప్ర‌పంచ దేశాల ముందు అడుక్కులానే చేస్తాన‌ని చెప్పి. అలానే చేశార‌ని.. బీజేపీ భ‌జ‌న చేస్తున్న విష‌యం కూడా తెలిసిందే. అయితే, ఒకింత వాస్త‌వంలోకి వ‌స్తే.. నిజంగానే మోడీ కార‌ణంగా ఆయాదేశాలు ఇలా మారాయా? అంటే.. అంత‌ర్జాతీయ రాజ‌కీయ ప‌రిశీల‌కులు భిన్న‌మైన వాద‌న చెబుతున్నారు.

ఆయా దేశాల‌కు.. చైనా అప్పులు ఇచ్చింద‌ని.. అధిక వ‌డ్డీలు అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌ట్టెక్కాల‌నే ఉద్దేశంతో చైనా మాయ‌లో ప‌డ్డ ఆయాదేశాలు అనేక ప్రాజెక్టులు చేప‌ట్టాయ‌ని..తీరాచూస్తే.. ఆయా విష‌యాల్లో చైనా పెత్త‌నం పెరిగిపోయి.. ఆ దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలాయి. ఇది వాటిని కోలుకోలేని విధంగా దెబ్బ‌కొట్టింది. అందుకే అవి అప్పుల పాలై.. ఆర్థికంగా.. రాజ‌కీయంగా కూడా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి.

ఒక వేళ అలా కాకుండా.. చైనా ద‌న్నుతో వివిధ ప్రాజెక్టులు చేప‌ట్టిన ఆయా దేశాలు.. ఆర్థికంగా బ‌లం పుంజుకుని ఉంటే.. భార‌త్ ప‌రిస్థితి ఏంటి? అదృష్ట‌మో.. దుర‌దృష్ట‌మో.. ఆయా దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి కాబ‌ట్టి చైనా అంటే..ఇప్పుడు వాటికి మంట‌. అందుకే భార‌త్ వైపు చూస్తున్నాయి. లేకుంటే.. భార‌త్‌కు ఆయా దేశాల నుంచి సెగ మామూలుగా ఉండేది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది కూడా నిజ‌మే క‌దా!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.