Begin typing your search above and press return to search.

నిన్న మాస్కులొద్దన్నారు .. నేడు లాక్ డౌన్ పెట్టేశారు !

By:  Tupaki Desk   |   27 Jun 2021 12:30 AM GMT
నిన్న మాస్కులొద్దన్నారు .. నేడు లాక్ డౌన్ పెట్టేశారు !
X
కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలని ఓ ఆట ఆడుకుంటోంది. కరోనా మహమ్మారి కొంచెం తగ్గినట్లే తగ్గి, మళ్ళీ విజృంభిస్తుండటంతో చాలా దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. కరోనా పూర్తిగా ఎప్పటికి కట్టడి అవుతుందో ప్రపంచంలోని ఏ దేశం కూడా చెప్పలేకుంది. ప్రస్తుతం అందరి ముందున్న ఏకైక మార్గం ఏమిటంటే .. వ్యాక్సిన్ వేపించుకొని , భౌతిక దూరం పాటించాలి. కానీ దేశంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ తగ్గిపోయింది కాబట్టి మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొన్ని దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ ముచ్చట ఎన్నో రోజులు నిలువలేదు. మాస్కులు కూడా వద్దులే అని చెప్పిన దేశాల్లో మాస్కులు పెట్టుకోమని కాదు ఏకంగా లాక్ డౌనే విధిస్తున్నాయి. తమ దేశాల్లో కరోనా పూర్తిగా కనుమరుగై పోయిందని , జనాలు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మొదటి ప్రకటించిన దేశం ఇజ్రాయెల్. దేశ ప్రభుత్వం అలా ప్రకటన చేసిందో లేదో ఇన్ని రోజులుగా కుక్కిన పేనులా ఇంట్లోనే ఉన్న ప్రజలు పలోమని రోడ్లపైకి వచ్చేశారు. సినిమా హాళ్ళు, హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్బులు అన్ని హౌస్ ఫుల్. అలా జనాలు కనిపించేసరికి కరోనా కి కూడా మళ్లీ రావాలని అనిపించిందేమో దెబ్బకి మాయమైపోయిందనుకున్న మహమ్మారి మళ్ళీ వచ్చింది. దీనితో పేస్ మాస్కులే వద్దన్న ప్రభుత్వం ఏకంగా లాక్ డౌన్ విధించింది. దీనికి ప్రధాన కారణం అక్కడ భారీ స్థాయిలో కరోనా మహమ్మారి కేసులు నమోదు కావడమే. ఒక్క ఇజ్రాయెల్ దేశమే కాదు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, ఫిజీ ఐల్యాండ్స్, ఆఫ్రికాలోని దాదాపు 14 దేశాలు, రష్యా రాజధాని మాస్కో, కాంగో, ఉగాండా దేశాల్లోని ప్రభుత్వాలు మళ్ళీ లాక్ డౌన్ విధించేశాయి.

ఆ దేశాల్లో జరిగిన పరిస్థితిని బట్టి అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ కు విరుగుడు మందు లేదు. రాకుండానే కాదు వచ్చిన తర్వాత కరోనా ను పూర్తిగా అరికడుతుందనే నమ్మకం లేదు. కరోనా ను కొంతమేర ఆపగలిగే శక్తి ఉన్న మందులు మాత్రమే ఉన్నాయి. కరోనా సోకకుండా ఉండేందుకు ఏకైక మార్గం డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయడమే. వీలైనంతలో ఇళ్ళల్లో నుండి బయటకు రాకుండా ఉండటమే ఏకైక రక్షణ మార్గం. మనంతట మనం ఆహ్వానిస్తే కానీ కరోనా వైరస్ ఎవరి ఒంట్లోకి రావటంలేదన్నది వాస్తవం. జనాలకు డిసిప్లిన్ లేకపోవటమే సమస్యగా మారిపోయింది. దీన్నే కరోనా అడ్వాంటేజ్ గా తీసుకోని కరోనా స్వైరవిహారం చేస్తుంది. దీనితో లాక్ డౌన్ ను ఎత్తేసిన పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ వైపు సాగుతున్నాయి.