Begin typing your search above and press return to search.
ఆ పని చేసిన అమ్మాయిలకు రూ.28వేల ఫైన్
By: Tupaki Desk | 18 March 2021 2:30 PM GMTమీడియాను మింగేస్తున్న సోషల్ మీడియా పుణ్యమా అని.. చోటు చేసుకుంటున్న విపరిణామాలు ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతున్నాయి. సంచలనం కోసమో.. వైరల్ కావటం కోసమో.. రాత్రికి రాత్రి ఫేమ్ తెచ్చుకోవటం కోసమో చేస్తున్న పనులు ఇప్పుడు పలువురిని పక్కదారి పట్టేలా చేస్తున్నాయి. యూపీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు చేసిన పని చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.
సంచలనం కోసం వారు చేసిన పనికి పోలీసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి దిమ్మ తిరిగే ఫైన్ వేశారు. ఇంతకూ జరిగిందేమంటే.. యూపీలోని ఘజియాబాద్ కు చెందిన ఇద్దరు యువతులు తాము వైరల్ కావటం కోసం ఒక సాహసానికి తెర తీశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శివంగి దబస్ తన స్నేహితురాలు కమ్ రెజ్లర్ అయిన రఘువన్షితో కలిసి ఒక బైక్ విన్యాసాన్ని చేసింది. రెజ్లర్ స్నేహ భుజాల మీద శివంగి కూర్చుంటే.. ఆమె బైక్ నడిపింది.
దీనికి సంబంధించిన వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇద్దరుయువతులు చేసిన ఈ సాసహసం వైరల్ గా మారింది. అదే సమయంలో.. ఈ విన్యాసానికి సంబంధించిన క్లిప్ పోలీసుల చేతికి చేరింది. అంతే.. రంగంలోకి దిగిన ఘజియాబాద్ ట్రాఫిక్ అధికారులు రెజ్లర్ స్నేహ తల్లి మంజుదేవి ఇంటికి రూ.11వేల చలానా వేసి పంపారు.
ఈ సాహసం కోసం బైక్ ఇచ్చిన టూవీలర్ యజమాని సంజయ్ కుమార్ కు రూ.17వేల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకన్నారు. సరదా కోసం చేసిన సాహసం ఇలా భారీ ఫైన్ పడుతుందని వారు వాపోతున్నారు. సాహసం చేసే ముందు.. చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయన్న విషయాన్ని కూడా తెలుసుకుంటే.. ఈ తిప్పలే ఉండేవి కాదు కదా?