Begin typing your search above and press return to search.
బాబుతోసహా ఆ నలుగురూ..!
By: Tupaki Desk | 20 July 2019 8:13 AM GMTఏపీ అసెంబ్లీ యమ రంజుగా సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ శివాలెత్తిపోతున్నాడు. మంత్రులు ఊసిగొల్పుతున్నారు. ఇక ప్రతిపక్ష చంద్రబాబు తక్కువ తినలేదు. ఆయన సై అంటే సై అంటూ 40ఏళ్ల అనుభవంతో ఢీకొంటున్నారు. అయితే వైసీపీ తరుఫున అందరూ చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. ఉపశాసనసభా పక్ష నేత అచ్చెన్నాయుడును చెడుగుడు ఆడేస్తున్నారు.
వైసీపీ ధీటుగా ఇప్పుడు అసెంబ్లీలో నిలబడుతున్నది ఆ నలుగురే కావడం గమనించదగ్గ విషయమని టీడీపీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ కేవలం 23మంది ఎమ్మెల్యేలనే గెలుచుకుంది. వైసీపీ అఖండ విజయంతో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. కొందరు బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబుతో సహా నలుగురు ఎమ్మెల్యేలే టీడీపీకి మిగిలారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు వైసీపీ ధాటికి టీడీపీలో నలుగురు మాత్రమే యాక్టివ్ గా ఉండడం ఆ పార్టీని కలవరపెడుతోంది. వైసీపీ ధాటిని తిప్పికొట్టడంలో బాబుతోపాము మరో ముగ్గురు ఎమ్మెల్యేలే యాక్టివ్ గా ఉండడం గమనార్హం.
చంద్రబాబును ఇరుకునపెడుతున్న సమయంలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే వైసీపీని ధీటుగా ఎదుర్కొంటున్నారట.. మిగిలిన ఎమ్మెల్యేలే ఎవరూ ఎదురుదాడి చేయడానికి.. బాబును సపోర్ట్ చేయడానికి ముందుకురాకపోవడం విస్మయం కలిగిస్తోందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
టీడీపీలో ఈసారి కరణం బలరాం.. పయ్యావుల కేశవ్ లాంటి టీడీపీ దూకుడైన నేతలు గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక ఫైర్ బ్రాండ్స్ వల్లభనేని వంశీ, వెలగపూడి రామకృష్ణ వంటి వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.. ఇక సింహంలాంటి చంద్రబాబు బావమరిది బాలక్రిష్ణ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రి గంటా అయితే పూర్తిగా మౌనం దాల్చారు. ఇంత మంది దిగ్గజ నేతలున్నా వైసీపీని ఎదుర్కోవడానికి.. చంద్రబాబుతోడుగా ఎవ్వరూ ముందుకు రాకపోవడం ఆ పార్టీలో విస్మయం కలిగిస్తోంది.
151మంది ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను కాచుకొని కేవలం ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలు నిలబడుతున్నారు. అచ్చెన్నాయుడు, నిమ్మల, బుచ్చయ్య చౌదరిలే వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో మిగతా నేతలంతా యాక్టివ్ గా లేకపోవడంతో టీడీపీలో ఆ నలుగురేనా? అనుమానాలు కలుగుతున్నాయి. మిగతా వారంతా దేనికోసం ఇలా మౌనంగా ఉన్నారు. పార్టీ మారుతారా అన్న చర్చ సాగుతోంది.