Begin typing your search above and press return to search.

ఆ టిక్కెట్లు గంటలో అమ్ముడు పోయాయి..

By:  Tupaki Desk   |   6 Jun 2022 8:30 AM GMT
ఆ టిక్కెట్లు గంటలో అమ్ముడు పోయాయి..
X
క్రీడల్లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మాములుది కాదు. కాస్త లోకం తెలిసిన యువకుడి నుంచి రిటైర్డ్ అయ్యి కూర్చున్న వాళ్ల వరకు ఈ ఆటను ఇష్టంగా చూస్తారు. ఫార్మాట్ ఏదైనా టోర్ని జరుగుతున్నడు.. ఆ విశేషాలు తెలుసుకునేవరకు నిద్రపట్టదు. నైట్ మ్యాచ్ అయితే నిద్రలేకుండా చూస్తారు కొందరు. అయితే ఇప్పుడు ఏపీలోని విశాఖ వారికి క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇక్కడి వీడీసీఏ స్టేడియంలో ఈనెల 14న 2020 మ్యాచ్ నిర్వహించబోతున్నారు. దీంతో రోజూ టీవీల్లో చూసే ఆటగాళ్లు మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతారు. ఈ పండుగలో పాల్గొనేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు క్రికెట్ అభిమానులు. ఆరోజు ఆటను వీక్షించేందుకు టిక్కెట్ల కోసం కుస్తీ పడుతున్నారు.

క్రీడాభిమానులకు అనుగుణంగా బీసీసీఐ పలు టోర్నీలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికా సిరీస్ ను ప్రారంభించబోతుంది. ఈ సీరీస్ లో మొత్తం మూడు మ్యాచ్ లు ఆడనున్నారు.

ఇవన్నీ దేశంలోనే నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈనెల 9 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మూడో 2020 మ్యాచ్ ను ఏపీలోని విశాఖలో 14న నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వీడీసీఏ స్టేడియాన్ని రెడీ చేరస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఈ బాధ్యతలను తీసుకొని ఏర్పాట్లు చేస్తోంది.

విశాఖలో లైవ్ క్రికెట్ చూసేందుకు అభిమానులు ఉత్సాహ పడుతున్నారు. ఆరోజు కోసం ఎదురుచూస్తున్నారు. 5వ తేదీ నుంచి టిక్కెట్ల విక్రయం ప్రారంభించడంతో అభిమానులు ఎగబడుతున్నారు.

స్టేడియం మొత్తం 27,251 సీట్లు ఉండగా కొన్ని టిక్కెట్లను స్థానిక క్రికెట్ క్లబ్ లకు కేటాయించనున్నారు. మిగిలిన టిక్కెట్లను పేటీఎం యాప్ లో ఉంచారు. ఈ స్టేడియంలోకి ఎంట్రీ కోసం ఒక్కో టిక్కెట్ ధర రూ.6000. విశాఖలోని మూడు కేంద్రాల్లో మ్యానువల్ గా టిక్కెట్లు విక్రయిస్తున్నారు. మిగతా కేంద్రాల వాళ్లు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటే కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తున్నారు.

అయితే ఆన్లైన్లో ఉంచిన రూ.1500, రూ.2000 గంటల్లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. విశాఖవారే కాకుండా ఇతర ప్రాంతాల్లోని వారు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేయించుకొని తమ సీటును ఏర్పాటు చేసుకున్నారు.చాలా రోజుల తరువాత ఏపీలో నేషనల్ టీం ఆడుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రియుల్లో జోష్ విపరీతంగా పెరిగింది. కొందరు ఒకరోజు ముందే నగరానికి చేరుకొని స్టే చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.