Begin typing your search above and press return to search.

నమ్మలేరు కానీ నిజం.. ఆ కవలలకు నాన్నలు వేరు!

By:  Tupaki Desk   |   8 Sep 2022 5:34 AM GMT
నమ్మలేరు కానీ నిజం.. ఆ కవలలకు నాన్నలు వేరు!
X
సిత్రమైన విషయాలు కొన్ని బయటకు వస్తుంటాయి. ఇప్పుడు చెప్పేది ఆ కోవలోకి చెందింది. ఒక మహిళ పండంటి కవలల్ని కన్నది. అనుకోని రీతిలో డీఎన్ ఏ పరీక్ష చేయాల్సి రావటం.. వారిద్దరి తండ్రులు వేర్వేరన్న షాకింగ్ నిజం బయటకు వచ్చింది. దీంతో సదరు మహిళ సైతం కంగుతిన్న పరిస్థితి. చాలా అరుదుగా చోటు చేసుకునే ఈ ఉదంతం అసలెలా సాధ్యం? అన్న విషయంలోకి వెళ్లటానికి ముందు.. అసలేం జరిగిందో తెలుసుకోవాల్సిందే. ఆసక్తికరంగానే కాదు.. ఇలా కూడా జరుగుతుందా? అనిపించే ఈ అంశంలోకి వెళితే..

బ్రెజిల్ కు చెందిన 19 ఏళ్ల యువతి ఒకరు కవలలకు జన్మనిచ్చారు. పిల్లలకు 8 నెలల వయసకు వచ్చాక వారి తండ్రి ఎవరన్న సందేహం ఆమెకు కలిగింది. ఆ పిల్లలకు తాను తండ్రిగా భావిస్తున్న యువకునికి పితృత్వ పరీక్షలు చేయగా.. కవలల్లోని ఒకరికి మాత్రమే అతని డీఎన్ఏతో మ్యాచ్ అయ్యింది. దీంతో ఆ యువతి షాక్ తిన్నది. ఆ తర్వాత గుర్తు చేసుకోగా.. తాను ఒకే రోజున ఇద్దరితో వేర్వురుగా శారీరకంగా కలిసిన విషయాన్ని ఆమె గుర్తుకు తెచ్చుకుంది.

దీంతో ఆ యువకునికి సైతం పితృత్వ పరీక్షలు చేయగా.. కవలల్లోని రెండో వారి డీఎన్ఏతో మ్యాచ్ అయ్యింది. ఇలా కవలల నాన్నలు వేర్వేరు అన్న విషయం బయటకు వచ్చింది. ఇది చాలా అరుదైన విషయంగా వైద్యులు చెబుతున్నారు. సైంటిఫిక్ గా చూస్తే.. ఇదెలా సాధ్యమన్న దానికి వైద్యులు చెబుతున్నదేమంటే.. ఇలాంటి పరిస్థితిని శాస్త్రీయంగా 'హెటరో పేరెంటర్ సూపర్ ఫెకండేషన్' గా చెబుతున్నారు.

ఒకేరోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసిన సమయంలో సదరు మహిళ తాలుకు రెండు అండాలు వారి వీర్యకణాలతో వేర్వేరుగా ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఇలా జరిగినప్పుడు తయారయ్యే రెండు పిండాలు వేర్వేరుగా ఉమ్మనీటి సంచిలో పెరుగుతాయని.. మనుషుల్లో ఇలాంటివి చాలా చాలా అరుదని.. పలు జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమైన విషయంగా చెబుతున్నారు. కానీ.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న సదరు యువతి పరిస్థితి ఎలా ఉంటుందో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.