Begin typing your search above and press return to search.

క‌రోనా పుట్టుక‌కు ఆ ఇద్ద‌రే కార‌ణమ‌ట‌!

By:  Tupaki Desk   |   30 May 2021 3:30 PM GMT
క‌రోనా పుట్టుక‌కు ఆ ఇద్ద‌రే కార‌ణమ‌ట‌!
X
ప్ర‌పంచవ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది చావుకు కార‌ణ‌మైన క‌రోనా వైర‌స్ పుట్టుక‌కు ఇద్ద‌రు చైనా శాస్త్ర‌వేత్త‌లే కార‌ణ‌మా? వుహాన్ ల్యావ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందా? అన్న ప్ర‌శ్న‌ల‌కు తాజాగా మీడియా క‌థ‌నం అవును అని స‌మాధానం చెబుతోంది. కొవిడ్ పుట్టుక‌కు సంబంధించి తైవాన్ మీడియా ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. దీని ప్ర‌కారం.. వుహాన్ ల్యాబ్ నుంచే వైర‌స్ ఉద్భ‌వించింది. అది కూడా ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌ల ద్వారానే మ‌నుషుల‌కు వ్యాపించింద‌ని చెబుతోంది ఆ క‌థ‌నం. దీని ప్ర‌కారం...

వుహాన్ వైరాల‌జీ ల్యాబ్ లో ప్ర‌మాక‌ర‌మైన వైర‌స్ ల‌పై శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నారు. ప్ర‌ధానంగా గ‌బ్బిలాల ద్వారా వ్యాపించే వైర‌స్ ల‌పై రీసెర్చ్ చేస్తున్నారు. గ‌బ్బిలాల ర‌క్తం, మంసం, వాటి మ‌లంపైనా ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో సైంటిస్టులు అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే ప్ర‌పంచంలో ఇంత వినాశ‌నానికి కార‌ణ‌మైంద‌ట‌.

శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్న స‌మ‌యంలో గ‌బ్బిలాలు ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌ల‌ను క‌రిచాయ‌ట‌. ఆ విధంగా వారి నుంచే వైర‌స్ ఇత‌రుల‌కు వ్యాపించింద‌ని తైవాన్‌ క‌థ‌నం చెబుతోంది. ఇదంతా 2017లోనే జ‌రిగింద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత నుంచి క్ర‌మంగా వైర‌స్ విస్త‌రించ‌డం మొదలు పెట్టింద‌ట‌. అయితే.. 2019 వ‌ర‌కు ఈ ప్ర‌మాదాన్ని చైనా ప‌సిగ‌ట్ట‌లేక‌పోయింద‌ట‌. ఆ త‌ర్వాత కూడా వైర‌స్ విజృంభించే వ‌ర‌కూ గోప్యంగా ఉంచింద‌ని స‌మాచారం.

కాగా.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ బృందం ఇప్ప‌టికే చైనా వెళ్లి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ.. ల్యాబ్ నుంచి వైర‌స్ వ‌చ్చిన‌ట్టు స్ప‌ష్ట‌మైన‌ ఆధారాల్లేవ‌ని ఆ బృందం ప్ర‌క‌టించింది. ఇప్పుడు తైవాన్ మీడియా క‌థ‌నం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. మ‌రోవైపు.. మూడు నెల‌ల్లో క‌రోనా పుట్టుక‌పై నివేదిక ఇవ్వాల‌ని సొంత నిఘా సంస్థ‌ల‌ను అమెరికా అధ్య‌క్షుడు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి, ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో ఇంకెలాంటి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.