Begin typing your search above and press return to search.

దేశంలోని ఆ రెండు రాష్ట్రాల వారు ఐసిస్ లో చేరేందుకు సిద్ధమట

By:  Tupaki Desk   |   26 July 2020 8:10 AM GMT
దేశంలోని ఆ రెండు రాష్ట్రాల వారు ఐసిస్ లో చేరేందుకు సిద్ధమట
X
అధినేత హటాత్తుగా హతమైతే సంస్థ ఏదైనా వచ్చే ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఐసిస్ లాంటి సంస్థకు ఇలాంటి తిప్పలు ఎక్కువ. ఆ మధ్యన ఐసిస్ చీప్ హతమయ్యాక.. ఈ భయంకర ఉగ్రవాద సంస్థ నిర్వీర్యమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో మాదిరి ఐసిస్ రాక్షసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించం.. దారుణ మారణకాండను సృష్టించలేకపోతున్నారు. వారంతా కామ్ గా ఉన్నారు కాబట్టి.. ఐసిస్ నిర్వీర్యమైనట్లుగా భావిస్తే తప్పులో కాలేసినట్లేనని చెబుతోంది ఐక్యరాజ్యసమితి తాజా సిద్ధం చేసిన రిపోర్టు.

దేశంలోని కర్ణాటక.. కేరళ రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు వీలుగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేస్తుందని.. అందుకు తగ్గట్లు కుట్రలు సిద్దమవుతున్నట్లు హెచ్చరించింది. పాకిస్తాన్.. బంగ్లాదేశ్.. మయన్మార్ నుంచి దగ్గర గ్గర 200 మంది ఉగ్రవాదులు దేశంలోనే ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారు ఐసిస్ లో చేరేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది.

ఐసిస్.. అల్ఖైదా రెండు సంస్థలు తమ అనుబంధ సంస్థల సాయంతో దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. తాజాగా ఐక్యరాజ్య సమితి రూపొందించిన నివేదికలో పేర్కొన్న ప్రకారం.. అత్యంత క్రూరమైన ఐసిస్.. అల్ ఖైదాలో చేరేందుకు భారత్ కు చెందిన కర్ణాటక.. కేరళ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారు ఐసిస్ లో దగ్గర దగ్గర 200 మంది వరకు ఉన్నారని.. అప్రమత్తం కావాలన్న సందేశం.. ఉలిక్కిపడేలా చేసింది. ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్ని అలెర్ట్ చేశారు. అంతేకాదు.. ఐసిస్ సంస్థ భారత్ లో ప్రావిన్స్ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాల్ని చూస్తే.. ఐసిస్ తో కొత్త తరహా ముప్పు మనకు ఉందన్న షాకింగ్ నిజం అర్థం కాక మానదు.