Begin typing your search above and press return to search.

విన్నోళ్లు వణికిపోతున్నారు.. వాడిలో మాత్రం పశ్చాత్తాపం నిల్.. వీడ్నేం చేయాలి?

By:  Tupaki Desk   |   17 Nov 2022 4:21 AM GMT
విన్నోళ్లు వణికిపోతున్నారు.. వాడిలో మాత్రం పశ్చాత్తాపం నిల్.. వీడ్నేం చేయాలి?
X
హత్యలు.. అత్యాచారాలు.. హత్యాచారాలు.. ఇలా దారుణ నేరాలు.. ఘోరాలు మన దేశంలో నిత్యం ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంటాయి. ఇంత నేరమయ సమాజమా? అన్న సందేహం కలుగుతుంది. అయితే.. కాస్తంత జాగ్రత్త.. అంతకు మించిన ముందుచూపుతో పాటు.. విషయాల్ని అదే పనిగా నమ్మేయకుండా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునే కన్నా.. జీవితాల్ని ప్రభావితం చేసే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది ఢిల్లీలోని శ్రద్దా వాకర్ హత్యోదంతం స్పష్టం చేస్తోంది.

మూడు రోజుల క్రితం బయటకు వచ్చిన ఈ దారుణ ఉదంతం గురించి విన్నోళ్లంతా జీర్ణించుకోలేకపోవటమే కాదు.. కొందరైతే వికారం తట్టుకోలేకపోతున్నారు. ఇంత నీచంగా.. మరింత దారుణంగా వ్యవహరిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. కళ్ల ముందు జరిగినట్లుగా బయటకు వస్తున్న వివరాల్ని చూస్తుంటే.. దాని గురించిన వివరాల్ని విన్నోళ్లంతా వణికిపోతున్నారు.

అంతలా ప్రేమించి.. మరీ ఇంతలా దారుణంగా వ్యవహరిస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తనను పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేస్తున్న శ్రద్ధ వాకర్ ను వదిలించుకునేందుకు హత్య చేయటం ఒక ఎత్తు అయితే.. ఆమె శరీర భాగాల్ని కట్ చేసి..

వాటిని రోజుకో చోట పడేసి రావటం తెలిసిందే. ఇందుకోసం రక్తాన్ని ఎలా శుభ్రం చేయాలి? ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండాలంటే పోలీసులతో ఏం మాట్లాడాలి? ఎలాంటి ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలి? లాంటి అంశాలకు ముందుస్తుగానే సిద్ధమయ్యాడు ఈ నరరూప రాక్షసుడు.

అతగాడి నోటి నుంచి వచ్చిన ఒక మాట అతడ్ని పట్టించేలా చేసింది. ఇంటి నుంచి శ్రద్ధా వెళ్లిపోయిందంటూ ఆమె ప్రియుడు అఫ్తాబ్ చెప్పటం.. ఆమె ఫోన్ సిగ్నల్ ఆ తేదీ తర్వాత వారం రోజులు కూడా ఆ ఇంటి లొకేషన్ లోనే ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. తాను చేసిన ఘోరం గురించి చెప్పేశాడు. దీంతో.. ఈ వ్యవహారం బయటకు రావటమే కాదు.. ఈ రోజున దేశ వ్యాప్తంగా ఈ ఉదంతం గురించి విన్నోళ్లంతా వణికిపోయే పరిస్థితి.

ఇంతటి పాడు పని చేసి కూడా.. అతడ్ని పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో కానీ.. అతని ఘోరం గురించి విన్న పోలీసులు సైతం విస్తుపోయిన వేళలోనూ.. అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవటం.. అతడి కళ్లలో ఎలాంటి బాధ కనిపించకపోవటాన్ని పోలీసులు సైతం జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇంత కర్కశంగా ఎలా ఉంటాడన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ దారుణ హత్యోదంతం ఇప్పుడు లవ్ జిహాదీగా మారింది. శ్రద్ధాను మతం మారాలని తరచూ వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె స్నేహితులు కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో.. ఇప్పుడీ అంశం పై కొత్త చర్చ మొదలైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.