Begin typing your search above and press return to search.
బ్లడ్ గ్రూప్ ను బట్టి, అందులోని రిసిస్టెన్సీని బట్టి కొవిడ్ వ్యాపించే అవకాశాలు!
By: Tupaki Desk | 4 March 2021 1:30 PM GMTకొవిడ్-19గా పిలవబడే కరోనా వైరస్.. ఇప్పుడు ఎన్ని వేరియంట్లుగా రూపాంతరం చెందిందో చెప్పడం కష్టంగా మారింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ వైరస్ సరికొత్త రూపాలు బయటపడుతున్నాయి. మన దగ్గర కాస్త కొవిడ్ ప్రభావం తగ్గినప్పటికీ.. మిగిలిన దేశాల్లో మాత్రం ఇంకా పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. అయితే.. అసలు కొవిడ్ ఎవరిపైన ప్రభావం చూపుతుందనే విషయంలో పరిశోధన సాగించిన శాస్త్రవేత్తలు.. సరికొత్త రిపోర్టు ఇచ్చారు.
ఈ మేరకు మార్చి 3వ తేదీన సైంటిఫిక్ జర్న్ లో ఓ వార్త పబ్లిష్ అయ్యింది. దీని ప్రకారం కొవిడ్ వైరస్ బ్లడ్ గ్రూపును బట్టి రియాక్ట్ అవుతుందని సైంటిస్టులు వెల్లడించారు. ప్రధానంగా ‘ఏ’ రకం బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో కొవిడ్ 19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రకటించారు.
వైరల్ ఆర్బిడి అనేది బ్లడ్ గ్రూప్ ఏ ఉన్నవారిని త్వరగా ఇన్ఫెక్ట్ చేస్తుందని రాసుకొచ్చారు. అన్నిరకాల బ్లడ్ గ్రూపులనున పరిశీలించిన తర్వాత.. బ్లడ్ టైప్ ‘ఏ’ ఉన్నవారికి సార్స్ కొవిడ్-2 త్వరగా వ్యాపిస్తుందని తేల్చారు. బ్లడ్ గ్రూప్ ను బట్టి, అందులోని రిసిస్టెన్సీని బట్టి కొవిడ్ వ్యాపించే అవకాశాలు పెరుగుతుంటాయని పరిశోధకులు తేల్చారు. కాబట్టి, చికిత్స కన్నా.. నివారణే మేలు అన్నట్టుగా వైరస్ సోకకుండా చూసుకోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.