Begin typing your search above and press return to search.
జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ పందెంకోళ్లు
By: Tupaki Desk | 11 Jan 2018 4:35 PM GMTకోడిపందేల విషయంలో కోర్టులు వద్దనడం - నాయకులు సై అనడం ఏటా మామూలే. ప్రధానంగా గోదావరి జిల్లాల్లోని అధికార పార్టీ నాయకులు స్వయంగా ఈ పందేల్లో పాల్గొనడం ప్రతి సంవత్సరం సాధారణమే. అయితే... ప్రభుత్వ కార్యక్రమాలు - పార్టీ కార్యక్రమాల్లోకి కూడా కోడిపందేలు తేవడం మాత్రం అరుదే. పైగా.. హైకోర్టు నుంచి దీనిపై ఆదేశాలున్న సమయంలో ఎంపీలు - ఎమ్మెల్యేలు వంటివారు తెరముందుకు రావడం తక్కువే. కానీ... ఓ టీడీపీ ఎంపీ - ఎమ్మెల్యే మాత్రం జన్మభూమి కార్యక్రమంలోనూ కోడిపందేల్లో పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మభూమి కార్యక్రమం ముగింపు సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిదులు కోడిపందేలు ఆడారు. జన్మభూమి కార్యక్రమం చివర్లో కోడిపందేలు నిర్వహించగా... కాకినాడ ఎంపీ తోట నర్సింహం - పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఇద్దరూ చెరొక పుంజును రంగంలోకి దించి సరదాగా ఆడారు.
హైకోర్టు కోడిపందేలపై ఆంక్షలు విధించినా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిదులు ఇలా కోడి పందేలు ఆడటం వివాదాస్పదం అయింది. అయితే... ఈ నేతల అనుచరులు మాత్రం తమ నాయకులు చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టకూడదని కోర్టు చెప్పిందని, దాని ప్రకారం కత్తులు కట్టని కోళ్లతో ఈ పందెం వేశారు కాబట్టి తప్పేమీ లేదని సర్టిఫికెట్ ఇస్తున్నారు. విమర్శలు మాత్రం వీరి తీరుపై మండిపడుతున్నారు. చంద్రబాబు టీంకి చట్టాలతో పనిలేదని విమర్శిస్తున్నారు.