Begin typing your search above and press return to search.
నాకొద్దు.. నా భార్యకు ఇవ్వండి
By: Tupaki Desk | 19 Feb 2019 5:04 AM GMTఎవరెన్ని చెప్పినా రాజకీయాల్లో వారసత్వం అనేది ఎప్పటినుంచొ ఉంది. భార్య లేదా కొడుకు లేదా కూతురు కనీసం అల్లుడికి అయినా తమ రికమండేషన్ తో సీటు ఇప్పించుకోవాలని నాయకులు ఆశ పడుతుంటారు. చాలామంది సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరారు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం.
గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు తోట నరసింహం. అయితే.. ఆయనకు ఈసారి ఎంపీగా పోటీ చేయాలని లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. పోటీ చేయాలనుకుంటే సరిపోయిందా చంద్రబాబు సీటు ఇవ్వాలిగా. అందుకే.. ఆయన ఒక తెలివైన ఎత్తుగడ వేశారు. తాను అనారోగ్యం కారణంగా పోటీ నుంచి తప్పుకుంటానని.. తన స్థానంలో తన భార్య వాణికి జగ్గంపేట ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని పార్టీ అధినాయకుడ్ని కోరుతున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యేగా ఆల్‌రెడీ జ్యోతుల నెహ్రు ఉన్నారు. తోట నరసింహానికి జగ్గంపేట కంచుకోట. ఈ స్థానంలో నరసింహం రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. గత ఎన్నికల్లో జగ్గంపేట వైసీపీకి వెళ్లింది. కానీ నెహ్రు వైసీపీని కాదని టీడీపీలో చేరారు. ఇప్పుడు నెహ్రుకు చెక్ పెట్టేందుకే నరసింహం తన భార్యని రంగంలోకి దించుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి తోట నరంసింహం అభ్యర్థనను చంద్రబాబు ఒప్పుకుంటారో లేదో చూడాలి.