Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేని... గాడిదకు స్వాగతం అంటూ తిట్టేసిన ఎమ్మెల్సీ
By: Tupaki Desk | 15 Jun 2022 3:59 PM GMTవైసీపీ నాయకులు హద్దులు దాటేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా జరిగిన ఘటన ఒకటి.. పార్టీలోనూ.. ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మండపేట నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న వేగుళ్ల జోగేశ్వరరావును ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్‌తోట త్రిమూర్తులు.. గాడిద అంటూ.. చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
టీడీపీ ఎమ్మెల్యే అయిన వేగుళ్ల జోగేశ్వరరావును ఉద్దేశించి గాడిదకు స్వాగతమంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో జరిగిన వైఎస్‌ఆర్ పంటల బీమా పంపిణీ కార్యక్రమంలో తోట చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనికి సంబంధించి పూర్వాపరాలను పరిశీలిస్తే మండపేటలో ధాన్యం బకాయిల కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ రైతుల కోసం మాట్లాడే అర్హత తనకు లేదని ఎమ్మె ల్సీ తోట త్రిమూర్తులు అంటున్నారని అలాంటప్పుడు ఆయనే రైతులకు ధాన్యం బకాయిలు ఇప్పించ వచ్చు కదా అని అన్నారు.
ఆ పని చేయకుండా గాడిదలను కాస్తున్నారా అని ప్రశ్నించారు. పంటల బీమా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఉద్దేశించి `గాడిదకు స్వాగతమంటూ` వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే వేగుళ్ల తాను మంచి స్నేహితులమని, ఆయన తనపై చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని, కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిదని తోట వ్యాఖ్యానించారు. తాను అద్దం లాంటివాడినని ఎలా చూస్తే అలా కనపడతానని చెప్పారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు హుందాగా స్వీకరిస్తానని, అంతేగాని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయన్నారు.
వేగుళ్ల కౌంటర్ ఇచ్చేందుకు మైక్ తీసుకోగా ఎమ్మెల్సీ తోట వేగుళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మైక్ ఆఫ్ చేయమని తోట త్రిమూర్తులు సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ తోట, ఎమ్మెల్యే వేగుళ్లను కలెక్టర్ హిమాన్షు శుక్లా సముదాయించారు. ఇదిలావుంటే, తోట వ్యాఖ్యలు.. వైసీపీలోనే చర్చకు దారితీశాయి. ఎంత చనువు ఉన్నప్పటికీ.. ఇలా చేయడం.. వ్యాఖ్యానించడం సమంజసమేనా? అని నాయకులు గుసగుసలాడుకున్నారు.