Begin typing your search above and press return to search.

పరిశీలకుల వల్ల కంపు తప్పదా ?

By:  Tupaki Desk   |   13 Sep 2022 9:30 AM GMT
పరిశీలకుల వల్ల కంపు తప్పదా ?
X
జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. పార్టీని క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేయటం, వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించాలని డిసైడ్ అయ్యారు.

ఈ పరిశీలకులు క్షేత్రస్థాయిలో బాగా బలమైన నేత అయ్యుండాలని జగన్ అనుకుంటున్నారట.ఈ పరిశీలకులు ఏమి చేస్తారంటే పార్టీ నాయకులతో పాటు జనాలకు సమన్వయకర్తలుగా ఉంటారట.

ఈ ఆలోచనే చాలా విచిత్రంగా ఉంది. పార్టీకి నాయకులకు, జనాలకు మధ్య సమన్వయకర్తలుగా కొత్తగా పరిశీలకులు ఎందుకు ? ఇపుడున్న మంత్రులు, ఎంఎల్ఏలు సరిపోరా ? పార్టీ నాయకత్వంతోను జనాలతోను మంచి సంబంధాలు నెరపటమే కదా మంత్రులు, ఎంఎల్ఏలు చేయాల్సింది. మంత్రులైనా, ఎంఎల్ఏలైనా పార్టీ బలోపేతానికే కదా పనిచేయాల్సింది. ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తునే పార్టీని బలోపేతం చేయటమే కదా మంత్రులు, ఎంఎల్ఏలు చేయాల్సింది.

వీళ్ళు చేయాల్సిన పనులను కొత్తగా పరిశీలకులతో చేయించాలని జగన్ అనుకుంటున్నారంటే మంత్రులు, ఎంఎల్ఏలు ఫెయిలనట్లేనా ? పోనీ పరిశీలకులైనా మంత్రులు, ఎంఎల్ఏలను కాదని స్వతంత్రంగా ఏమైనా చేయగలరా ? పరిశీలకుడిగా నియమితుడైన నేత బలవంతుడైతే మంత్రి, ఎంఎల్ఏకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతారు.

దీని వల్ల వాళ్ళ మధ్య గొడవలు పెరగి మొత్తం వ్యవహారమంతా కంపుగా తయారవుతుంది. ఈ ప్రభావం కచ్చితంగా ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల మీదే పడుతుందని జగన్ కు తెలీదా ?

ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయోగాలు చేసి పార్టీలో వివాదాలు పెంచి కంపు చేయటం తప్ప మరోటి కాదు. పరిశీలకుల కాన్సెప్ట్ కన్నా మంత్రులు, ఎంఎల్ఏలనే బలోపేతం చేయటం మంచింది. అవసరమైతే ఇద్దరు ముగ్గురు మంత్రులను మార్చేస్తే మిగిలిన వాళ్ళు వాళ్ళే దారికొస్తారు. దీని ప్రభావం ఎంఎల్ఏల మీదకూడా పడటం వల్ల వాళ్ళల్లో కూడా భయం మొదలవుతుంది. కాబట్టి వేరే దారి లేక పార్టీ, జనాలతో మంచి సంబంధాలు నెరుపుతారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.