Begin typing your search above and press return to search.
కాలిఫోర్నియాలో భూకంపం తర్వాతేం జరిగిందో తెలిస్తే షాకే!
By: Tupaki Desk | 8 July 2019 7:41 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో భూకంపం చోటు చేసుకోవటం తెలిసిందే. కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న ఈ భూకంపం కారణంగా ఎలాంటి మరణాలు చోటు చేసుకోకున్నా.. భారీగా ఆస్తినష్టం జరిగిందన్న వార్తలు వచ్చాయి. అయితే.. ఒక కీలకాంశం మాత్రం ప్రధాన మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఆసక్తితో పాటు.. ఆందోళన కలిగించేలా ఉన్న ఈ ఉదంతం పర్యావరణవేత్తలతో పాటు.. శాస్త్రవేత్తలు సైతం విస్మయానికి గురి అవుతున్నారు.
ఇంతకూ జరిగిందేమంటే.. కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న భూకంపాల తర్వాత శనివారం రాత్రి (అక్కడి స్థానిక కాలమానం ప్రకారం) వేలాది తేనటీగలు ఒక్కసారిగా చచ్చి కిందపడ్డాయి. రోడ్ల మీద పడి వేలాది తేనెటీగలు కింద పడి కొట్టుకొని చచ్చిపోయాయి. దీంతో.. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
సాధారణంగా భూకంపాలు.. సునామీలు వచ్చే ముందు ప్రకృతిలో వచ్చే మార్పుల్ని కీటకాలు.. పక్షులు.. జంతువులు గుర్తిస్తూ ఉంటాయి. ప్రకృతి పరిణామాల్ని గుర్తిస్తూ అవి ముందే హెచ్చరిస్తుంటాయని చెబుతుంటారు. దీనికి శాస్త్రీయ కారణం ఏమిటన్నది ఇప్పటివరకూ ఎవరూ గుర్తించలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తేనెటీగలు వేలాదిగా రోడ్ల మీద పడి చనిపోవటంతో అక్కడి వారు ఆందోళనకు గురి అవుతున్నారు.
దీనికి తగ్గట్లే అమెరికా జియలాజికల్ సర్వే అంచనా ప్రకారం రానున్న కొద్ది రోజుల్లో 8 వరకు భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ లో 7.1 ఉంటే.. శనివారం వచ్చిన భూకంప తీవ్రత 6.4గా చెబుతున్నారు. గడిచిన రెండు..మూడు రోజుల్లో దాదాపుగా 250 భూకంపాలు గుర్తించలేనంత స్థాయిలో వచ్చాయని.. వాటి తీవ్రత తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. శాస్త్రవేత్తల హెచ్చరికలకు ముందే తేనెటీగలు వార్నింగ్ బెల్స్ మోగించాయన్న మాట వినిపిస్తోంది. ఎప్పుడూ లేని రీతిలో వేలాది తేనెటీగలు మరణించటం అపశకునంగా చెబుతున్నారు.