Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో సేల్ కు రెడీగా అన్ని వేల ఇళ్లు ఉన్నాయా ?
By: Tupaki Desk | 18 Dec 2021 11:55 AM GMTతెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రస్తుతం దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధిరేటు పరంగా టాప్ ప్లేస్ లో ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీ, నోయిడా, ముంబాయి, బెంగుళూరు, చెన్నై నగరాలను మించి మరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వృద్ధి రేటు పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడ జరుగుతోంది అంటే జహీరాబాద్ అవుట్ కట్స్‌లో నడుస్తోంది. అంటే అక్కడ రియల్ రంగం ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో గమనించాలి.
అలాగే హైదరాబాద్ కోర్ సిటీని అనుకొని చుట్టూ 30 కిలోమీటర్ల దూరంలో కూడా విపరీతమైన అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. కేవలం ఆంధ్రా సెటిలర్లు కాకుండా తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మంది హైదరాబాదులో ఉంటున్నారు. అటు కర్ణాటక - తమిళనాడు - మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఇక్కడ అపార్ట్మెంట్లు, గృహాల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది.
మరోవైపు అపార్ట్‌మెంట్లతో పాటు ఇండివిడ్యూల్ గృహాల నిర్మాణం కూడా ఎక్కువుగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాల సంఖ్య 12 వేలకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే చాలా ఎక్కువ అనే రియల్ ఎస్టేట్ నిపుణులు చెపుతున్నారు. కరోనా ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రూపంలో పంజా విసిరింది. దీంతో ఐటీ రంగంలో ఉండే వాళ్లు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
చాలా మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఉండకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకే ఇన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇవన్నీ అమ్మాలంటే మరో సంవత్సరం సులువుగా పడుతుందని కూడా రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెపుతోన్న మాట.
అయితే కరోనా థర్డ్ వేవ్ రాకుండా ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని.. మళ్లీ కరోనా థర్డ్ వేవ్ వస్తే.. ఇవన్నీ ఇప్పట్లో అమ్ముడు అయ్యే అవకాశాలు లేవనే అంటున్నారు.