Begin typing your search above and press return to search.
అమెరికాలో మనోళ్లు దొరికిపోయారు
By: Tupaki Desk | 22 Jan 2016 9:26 AM GMTఅగ్రరాజ్యం అమెరికా ఎప్పుడు తన లెక్కలను పక్కాగా చూసుకుంటూ ఉంటుంది. తప్పు చేసినా తప్పించుకునే సామర్థ్యం ఆ దేశం సొంతం. ఇక అంతా పక్కాగా ఉంటే...ప్రపంచ పెద్దన్నను పట్టుకోలేం కదా! ఇటీవలి కాలంలో భారతీయ విద్యార్థులు - ఉద్యోగులను అమెరికా పెద్ద ఎత్తున స్వదేశానికి తిప్పి పంపింది. దీనిపై అంతటా గగ్గోలు పుట్టింది. అగ్రరాజ్యం అవమానకరమైన రీతిలో వ్యవహరిస్తోందంటూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. భారతదేశం తరఫున పలువురు ప్రతినిధులు ఘాటుగా స్పందించారు.
తను దోషిగా నిలబడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో అమెరికా అలర్ట్ అయింది. కీలక ప్రభుత్వ విభాగం అయిన హోం ల్యాండ్ సెక్యూరిటీని పురమాయించి లెక్కలు తీయించింది. అసలు దేశంలో ఎందరు, ఏ రకమైన వీసాలతో ఉంటున్నారు, అందులో గడువు ముగిసినా అమెరికా గడ్డపైనే తిష్టవేసిన వారి సంఖ్య ఏంటనేది ఆరా తీసింది. ఈ నివేదిక ప్రకారం అమెరికాకు వెళ్లిన ప్రతి వందమంది విదేశీయుల్లో ఒకరు గడువులోగా దేశాన్ని వీడడం లేదని తేలింది. ఇందులో మన భారతీయుల డాటా తీస్తే..గత ఏడాది 8.8 లక్షల మంది భారతీయులకు విజిటర్స్, వ్యాపారవేత్తలకు ఆ కేటగిరీలో బీ1, బీ2 వీసాలు జారీచేసింది. అయితే వీరిలో 14,000 మంది వీసా ఉండాల్సిన సమయం మించిపోయినా ఇంకా అమెరికాను వీడలేదట!
ఇతర దేశాల వారి సంఖ్య చూస్తే 7.6 లక్షల మందికి రిటర్న్ వీసాతో అమెరికాకు వెళ్లినప్పటికీ 11,653 మంది ఇంకా అక్కడే ఉన్నారట. ఇలా దాదాపు 98.83శాతం మంది పక్కాగా వీసా నిబంధనలు పాటిస్తున్నా...మిగతా వారు అక్కడే ఉంటున్నారని హోంల్యాండ్ నివేదిక తేల్చింది. ఈ నివేదిక ప్రకారమే తాము తగు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా పరోక్షంగా చెప్పింది. ఇదన్నమాట అంకుల్ శ్యామ్ అసలు లెక్క.