Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు థ్రెట్ ...
By: Tupaki Desk | 13 April 2016 5:01 AM GMTఏపీ సీఎం చంద్రబాబుకు ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటికే జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆయనకు మరింత భద్రత ఇస్తున్నారు. విజయవాడ సమీపంలోని ఉండవల్లి కరకట్టపై లింగమనేని ఎస్టేట్ లో ఉంటున్న ఆయనకు ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఆయన ప్రస్తుతం ఉంటున్న ఇల్లు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడం... పక్కనే నది ఉండడంతో ఎటునుంచి ఏ ముప్పూ రాకుండా కాపలా కాస్తున్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో మావోయిస్టు ఒకరు పోలీసులకు దొరకడంతో వారు ఏదైనా హాని తలపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో 100 మీటర్లకు ఒక నిఘా కెమేరా ఏర్పాటు చేశారు. కరకట్టపై 5 పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వీటిని దాటి వెళ్లడం అసాధ్యమన్న రీతిలో భద్రత ఏర్పాట్లు ఉన్నాయి.
ఇది కాకుండా కరకట్టపై నిత్యం బాంబు స్క్వాడ్ తనిఖీలు జరుపుతున్నారు. చుట్టూ ఉన్న పొలాలు - తోటల్లో స్పెషల్ పార్టీ పోలీసులు కాపలా ఉంటున్నారు.
పోలీసులకు నిఘావర్గాల నుంచి ఏదో సమాచారం అందిందని.. ప్రమాదాన్ని శంకించడం వల్లే ఈ స్థాయిలో భద్రత పెంచారని స్తానికులు అనుకుంటున్నారు. మరోవైపు భద్రత ఏర్పాట్ల కారణంగా స్థానికులు, చుట్టుపట్ల పొలాలు ఉన్నవారు తాము ఇబ్బంది పడుతున్నామంటున్నారు.