Begin typing your search above and press return to search.

రాహుల్‌.. నిన్ను జోడో యాత్ర‌లో లేపేస్తాం!

By:  Tupaki Desk   |   19 Nov 2022 4:30 AM GMT
రాహుల్‌.. నిన్ను జోడో యాత్ర‌లో  లేపేస్తాం!
X
దేశాన్ని ఏకతాటిపై తెచ్చేందుకు రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడోస‌ యాత్ర ఈనెల 20న మధ్యప్రదేశ్‌లోకి అడుగుపెట్టనున్న నేప్యథ్యంలో ఆయనకు అనూహ్యంగా ఒక‌ బెదరింపు లేఖ వచ్చింది.

ఇండోర్‌లోకి రాహుల్ అడుగుపెట్టగానే ఆయను బాంబులతో చంపుతాంటూ ఒక లేఖ జుని ప్రాంత‌ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఒక స్వీట్ షాప్ వెలుపల పోలీసులు కనుగొన్నారు. దీంతో వారు అప్రమత్తమై ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్కానింగ్ చేస్తున్నారు.

స్వీటు దుకాణం వెలుపల లేఖ విడిచిపెట్టిన వ్యక్తి ఎవరనే దానిపై ఆచూకీ తీస్తున్నారు. బెదిరింపు లేఖకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

వీర సావర్కర్‌పై రాహుల్ విమర్శలు చేసిన మరుసటి రోజే ఆయనకు బెదిరింపు లేఖ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సావర్కర్ బ్రిటిష్ పాలకులకు సహాయపడ్డాడని, భయం కారణంగానే క్షమాభిక్ష కోరుతూ లేఖ రాసారని రాహుల్ చేసిన విమర్శలు నిరసనలకు దారితీశాయి.

క్షమాభిక్ష పిటిషన్ లేఖను చూపిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ సావర్కర్ మనుమడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన కార్యకర్త వందన డోంగ్రో ఫిర్యాదు మేరకు థానే పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మరోవైపు, మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా షేగావ్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

లేఖ‌పై కాంగ్రెస్ వాద‌న ఇదీ..తాజాగా రాహుల్‌ను ఉద్దేశించి చంపేస్తామంటూ ఆగంతుకుడు రాసిన లేఖ‌పై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు గుప్పించింది. ఈ లేఖ వెనుక మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ హ‌స్తం ఉంద‌ని, బీజేపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే ఇలా రాయించార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. మ‌ధ్య‌ప్ర‌దే శ్‌లోకి అడుగు పెట్ట‌నివ్వ‌కుండా చేయాల‌నే కుట్ర ప‌న్నుతున్నార‌ని నాయ‌కులు ఆరోపించారు. ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా జోడో యాత్ర‌ను పూర్తిగా నిర్వ‌హిస్తామ‌ని సీనియ‌ర్ నాయ‌కుడు జైరాం ర‌మేశ్ వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.