Begin typing your search above and press return to search.
డెల్టా వేరియంట్ తో 100 దేశాలకు ముప్పు
By: Tupaki Desk | 3 July 2021 11:46 AM GMTఇండియాలో పుట్టిన డెల్టా వేరియంట్ కరోనా వైరస్ రాబోయే రోజుల్లో అత్యంత ప్రమాదకారిగా మారే ప్రమాదం ఉందని.. ఇప్పటి వరకు నమోదు అయిన వేరియంట్లలో డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ అధనామ్ ఘెబ్రేయేసన్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్థం ముగిసేప్పటికి ప్రపంచ వ్యాప్తంగా కనీసం 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లేదంటే ప్రమాదం అంచున దేశాలు నిల్చోవాల్సి రావచ్చు అంటూ ఆయన హెచ్చరించాడు. ఈ సమయంలో అన్ని దేశాల్లో కూడా వ్యాక్సినేషన్ పక్రియ గురించి ఆయన మాట్లాడాడు.
ఇప్పటి వరకు సరాసరిన పలు దేశాల్లో 10 శాతం మించిన వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని ఆయన అన్నాడు. పేద దేశాలతో వ్యాక్సిన్ ను పంచుకునేందుకు గతంలో పలు దేశాలు ఓకే చెప్పాయి. కాని ఇప్పుడు మాత్రం వాటి అవసరాలు తీరిన తర్వాతే వ్యాక్సిన్ ను బయట దేశాలకు ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఏడాది చివరి వరకు 40 శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేసే లక్ష్యంతో ప్రపంచ దేశాలు ముందడుగు వేయాలని అప్పుడే అన్ని విధాలుగా కరోనా నుండి కాస్త ఉపశమనం లభిస్తుందనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశాడు.
వచ్చే ఏడాది నాటికి 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే పట్టుదలతో అన్ని దేశాలు కూడా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించాడు. వ్యాక్సిన్ ఈక్విటీ చేయడం సరైన పని అని... మమ్మమ్మారిని నిర్మూలించేందుకు గాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా పని చేస్తుందన్నాడు. గతంలో యూఎస్‌ఏ, బ్రిటన్, ప్రాన్స్ వంటి దేశాలు 1 బిలియన్ వ్యాక్సిన్ ను విరాళంగా ఇచ్చేందుకు ఒప్పందం ఇచ్చాయి. ప్రపంచం మొత్తం అందరికి వ్యాక్సినేషన్ పూర్తి అవ్వాలంటే 11 బిలియన్ ల డోసుల వ్యాక్సిన్ కావాలంటూ ఆయన అభిప్రాయ పడ్డాడు.
డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్క దేశం కూడా జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. 100 దేశాలకు డెల్టా వేరియంట్ సోకే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇండియాలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా డెల్టా వేరియంట్ కేసు నమోదు అయిన విషయం తెల్సిందే.