Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు ముప్పు... ఎవరి నుంచి... ?
By: Tupaki Desk | 9 March 2022 5:30 PM GMTతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందా. ఇదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. చంద్రబాబు ప్రాణాలను ముప్పు ఉందని, అందువల్ల నిరంతరం మంగళగిరి పార్టీ ఆఫీస్ వద్ద సాయుధ బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య డీజీపీకి తాజాగా లేఖ రాయడం సంచలనం రేపుతోంది.
చంద్రబాబు అంటే ఆషామాషీ మనిషి కాదు, ఆయనకు ఎన్ ఎస్ జీ ప్లస్ ప్రొటెక్షన్ ఇపుడు ఉంది. అయితే ఆయన వారంలో అయిదు రోజుల పాటు గుంటూరు జిల్లాలోని మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉంటారు. అదే విధంగా ఆయన రెండు రోజులు తప్ప మొత్తం మిగిలిన వారమంతా గుంటూరు జిల్లాలోని తన నివాసంలో ఉంటారు.
ఇక చంద్రబాబుని నిత్యం కలవడానికి ఎంతో మంది వస్తారు అని వర్ల రామయ్య ఆ లేఖలో చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికి రెండు మూడు సార్లు చంద్రబాబు ఇంటి మీద, పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఏపీలో కొన్ని అసాంఘిక శక్తుల నుంచి చంద్రబాబుకు ఇబ్బంది ఉందని భావిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు అడ్డుతొలగించుకోవాలని కొందరు భావిస్తున్నారని పార్టీలో అనుమానాలు రేగుతున్నాయట. ఈ నేపధ్యంలో చంద్రబాబు భద్రతను మరింత పెంచాలని, పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా మరింత టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పార్టీ డిమాండ్ గా ఉంది. ఇదే విషయాన్ని లేఖ రూపంలో వర్ల ప్రస్తావిస్తున్నారు. ఈ నేపధ్యంలో డీజీపీకి రాసిన లేఖ అయితే సర్వత్రా చర్చకు తావిస్తోంది.
చంద్రబాబు ప్రజాక్షేత్రంలో ఉంటే ఇబ్బంది ఎవరికి ఉంటుంది. ఆయనను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అన్న ప్రశ్నలు అయితే వరసగా పుట్టుకువస్తున్నాయి. అయితే దీనికి సమాధానాలు కూడా టీడీపీ వారే చెబుతున్నారు. సంఘ విద్రోహ శక్తులు అని వారు అంటున్నారు. మరి వారు ఎవరు, ఎక్కడ ఉంటారు. టీడీపీ వంటి ప్రధానమైన పార్టీని వారు ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే గతంలో జరిగింది కదా అని ఉదహరిస్తున్నారు.
అప్పట్లో వైసీపీ అధినాయకత్వం మీద టీడీపీ నేత పట్టాభి చేసిన కొన్ని కామెంట్స్ కి యాంటీగా టీడీపీ ఆఫీసు మీద కొందరు దాడి చేశారు. వారు ఎవరో పోలీసులు అయితే ఇప్పటిదాకా తేలలేదు. మరో వైపు చూస్తే ఆ మధ్యన టీడీపీ నేతలు చేసిన కొన్ని కామెంట్స్ కి నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అది కూడా రాజకీయ వివాదంగానే చూశారు.
మరి ఇలాంటివి గతంలో జరగనేలేదు కానీ ఏపీలో పోటాపోటీగా పాలిటిక్స్ ఉంది కాబట్టి అలా జరిగింది అని అంతా భావించారు. అయితే ఇపుడు ఆల్ ఆఫ్ సడెన్ గా బాబు ప్రాణాలకు ముప్పు అంటూ టీడీపీ ఆందోళన వ్యక్తం చేయడం చూస్తూంటే ఇది ఏపీలో హీట్ ని రగిలించే ఇష్యూగా మారుతుంది అంటున్నారు. అదే టైమ్ లో టీడీపీ ఆఫీస్ కి రక్షణ కావాలని కోరుతున్నారు. మరి డీజీపీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ ఇది మాత్రం రాజకీయంగా ప్రకంపనలు రేపే అంశమే అవుతుంది అనడంలో సందేహమే లేదు.