Begin typing your search above and press return to search.
జైల్లో చిన్నమ్మకు ప్రాణహాని...
By: Tupaki Desk | 20 Feb 2017 1:10 PM GMTఅన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ మరోమారు ఆసక్తికరమైన వార్తతో తెరమీదకు వచ్చారు. పరప్పణ జైలులో తనకు ప్రాణాహాని ఉందని శశికళ పేర్కొన్నారు. జైలులో వాతావరణం కూడా తనకు సరిపడటం లేదని ఆమె వాపోయారు. తనను చెన్నై సెంట్రల్ జైలుకు తరలించాలని విజ్ఞప్తి చేస్తూ ఒక పిటిషన్ ను శశికళ జైలు అధికారులకు ఇచ్చారు. శశికళ పిటిషన్ ను జైలు అధికారులు పరిశీలిస్తున్నారు. చెన్నై సెంట్రల్ జైలుకు లేఖ రాయాలని పరప్పన జైలు అధికారులు భావిస్తున్నారు.
ఇదిలాఉండగా... శశికళ భర్త నటరాజన్ పై మద్రాసు హైకోర్టులో దాఖలైన కేసుకు కదలిక వచ్చింది. ఈ కేసును త్వరగా విచారించాలని సీబీఐ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. నటరాజన్ 1994లో తయారైన లెక్సస్ కారును 1993లో ఉపయోగించిన కారుగా పేర్కొంటూ దిగుమతి చేసుకున్న అంశంపై సీబీఐ - ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విడివిడిగా కేసులు నమోదు చేశాయి. కొత్త కారును అప్పటికే ఉపయోగించిన కారుగా చూపడంతో ప్రభుత్వ ఖజానాకు కోటి రూపాయిల పన్ను నష్టపోయినట్లు ఈడీ పేర్కొంది. తాజాగా శశికళ, ఇటీవలే నియమితుడైన అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ తదితరులపై పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ ఈడీ ఆర్థిక నేరాల కోర్టులో దరఖాస్తు చేసింది. ఈ కేసులో తుది వాదనలు ఈ నెల 27న జరుగనున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/