Begin typing your search above and press return to search.

విమర్శిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారట

By:  Tupaki Desk   |   12 Dec 2015 5:31 AM GMT
విమర్శిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారట
X
తెలంగాణ రాష్ట్ర అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలకు చిత్రమైన అనుభవం ఎదురైంది. టీ శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత.. సీనియర్ నేత షబ్బీర్ అలీకి తాజాగా ఒక వార్నింగ్ వచ్చింది. తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తే..చంపేస్తామని బెదిరిస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు.

షబ్బీర్ కు వచ్చిన వార్నింగ్ ఫోన్ కాల్ పై మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అధికారపక్షాన్ని విమర్శించే వారిని చంపేస్తామంటూ బెదిరించే వారి విషయంతో తెలంగాణ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని.. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోవద్దని పోలీస్ శాఖను కోరుతున్నారు. షబ్బీర్ అలీకి వచ్చిన బెదిరింపులు చూస్తేనే.. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్న విషయం తెలుస్తుందని దానం వ్యాఖ్యానించారు.

షబ్బీర్ అలీకి వచ్చిన హెచ్చరికల్ని తీవ్రంగా పరిగణించి పోలీసులుపని చేయాలని.. అలా కాని పక్షంలో తాము తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు రెస్ట్ అన్నది ఉండదంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. షబ్బీర్ అలీకి వచ్చిన చంపే బెదిరింపు ఫోన్ కాల్స్.. దానికి బదులుగా దానం నాగేందర్ చేసిన పోటీ వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు ఏ తీరులో స్పందిస్తారో..?