Begin typing your search above and press return to search.
బెదిరింపులు అఖిలప్రియ భర్తపై హత్యాయత్నం కేసు
By: Tupaki Desk | 3 Oct 2019 5:11 AM GMTమాజీ మంత్రి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే అఖిల ప్రియ భర్తపై హత్యాయత్నం కేసు నమోదైంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న అఖిల ప్రియకు అండగా ఆమె భర్త భార్గవ్ రామ్ ఆళ్లగడ్డలో అన్నీ తానై వ్యవహరించారు. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మారినా ఆ దూకుడు తగ్గించలేదని సమాచారం.
తాజాగా అఖిల ప్రియ భర్త భార్గవ్ రాం నాయుడు దందాలు, బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆళ్లగడ్డ రూరల్ మండలంలోని కోట కందుకూరు మెట్టవద్ద శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ క్రషర్ పరిశ్రమలో వాటాలో విషయంలో గొడవ తలెత్తింది. అఖిలప్రియ ఫ్యామిలీ 40శాతం, శివరామిరెడ్డి అనే వ్యక్తికి ఇందులో 60శాతం వాటా ఉంది.. ఈ నేపథ్యంలోనే ఈ క్రషర్ పరిశ్రమను తమకు పూర్తిగా అప్పగించాలని అఖిల ప్రియ భర్త వెళ్లి శివరామిరెడ్డిని బెదిరించినట్టు తెలిసింది. చిత్రహింసలుకు గురిచేసినట్లు సమాచారం.
దీంతో తన భర్త శివరామిరెడ్డిని హింసిస్తున్నారని అఖిలప్రియ భర్తపై శివరామిరెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు దాడి నిజమేనని నిర్ధారించారు. భార్గవ్ రాంపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈయనతో పాటు బెదిరించిన ఆయన అనుచరులు 10మందిపై కూడా కేసులు నమోదు చేశారు.
టీడీపీ హయాంలో అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యవహారాలను నడుపుతూ భార్గవ్ రాం నియోజకవర్గంలో హవా చెలాయించాడు. కానీ వైసీపీ ప్రభుత్వం కూడా అదే దూకుడు ప్రదర్శించడంతో చిక్కుల్లో పడ్డారు.