Begin typing your search above and press return to search.

చంపేస్తామని కిమ్​ కు బెదిరింపులు... తగ్గేదేలే అంటున్న కిమ్​!

By:  Tupaki Desk   |   29 Dec 2021 4:28 AM GMT
చంపేస్తామని కిమ్​ కు బెదిరింపులు... తగ్గేదేలే అంటున్న కిమ్​!
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అంటే చాలా దేశాలకు పడదు. అతని గురించి కామెంట్ చేయాలన్నా వివిధ దేశాలకు చెందిన వారు ఆలోచిస్తారు. ఒక దేశ అధ్యక్షుడిగా తనదైన శైలిలో పాలనను కొనసాగించడం ఆయన సొంతం. అంతేకాకుండా దేశమేదైనా వార్నింగ్ ఇవ్వడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అగ్రరాజ్యమైన అమెరికా కు కూడా కిమ్ కంటి మీద కునుకు లేకుండా చేశారు. పక్కనున్న దేశాలకు కూడా కిమ్ చేసే పనులు అసలు ఒప్పవు. తనకు నచ్చిన విధంగా ఉత్తర కొరియా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా ఎదిరించే లేకుండా ఎదిగారు సుమారు పదేళ్ల కిందట ఉత్తర కొరియా అధ్యక్షుడు అధికారంలోకి వచ్చిన కిమ్ ఇప్పటికీ వివిధ దేశాల మీద దూకుడుగా వ్యవహరిస్తుంటారు.

ముఖ్యంగా దేశ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడరు... ఇందుకు తగ్గట్టుగానే హైపర్ సోనిక్ మిస్సైల్ లాంటి వాటిని ఎప్పటికప్పుడు ప్రయోగిస్తూ ఇతర దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తుంటారు. ముఖ్యంగా కిమ్ చేష్టలకు బలైపోయిన దేశాలలో ముందుగా దక్షిణ కొరియా ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో జపాన్ నిలిచింది. పక్కనే ఉన్నా ఉత్తర కొరియా నుంచి సైనిక సామాగ్రిని ఎప్పటికప్పుడు ఉపయోగిస్తూ కిమ్ తన దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తుంటారు. కిమ్ మార్కు పాలన అనేది చాలా వేరుగా ఉంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు వైరస్ సోకకుండా లాక్​ డౌన్​ లాంటి చర్యలు చేపడితే కిమ్​ మాత్రం వింతగా మరో పద్ధతిని అనుసరించారు. అదే సరిహద్దులను మూసివేయడం.

ఇలా ఈయన చేసే చర్యలు అన్నీ వింతగా ఉంటాయి. ఉత్తర కొరియాతో స్నేహపూర్వకంగా వ్యవహరించే దేశాలు చాలా తక్కువ. దీనికి ప్రధాన కారణం కిమ్​ ప్రవర్తనే. అయితే ఇలాంటి కిమ్​ కే ఆ దేశ ప్రజలు వార్నింగ్​ ఇచ్చారు. చంపేస్తామని బెదరించారు. ప్రాణాలు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. కానీ కిమ్​ మాత్రం ఏ మాత్రం తగ్గలేదే లేదని అంటున్నారు. అయితే ఇంతకూ ఆ బెదిరింపులు ఎందుకు వచ్చాయి? వాటి వెనక ఎవరు ఉన్నారు? ప్రస్తుతం ఆ కిమ్​ ఎక్కడ ఉన్నారు?

ప్రస్తుతానికి కిమ్​ దక్షిణ కొరియాలో ఉన్నారు. కానీ మీరు అనుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ కాదు. అచ్చం అతని లాగే ఉండే కిమ్ మిన్ యోంగ్​. ఈయన ఆహార్యం కిమ్​ లాగే ఉంటుంది. అచ్చు గుద్దినట్లుగా కిమ్ లాగే ఉండండతో ఆయనను చాలా మంది ఆటపటించే వారు. దీంతో ఆయనకు వినూత్నంగా ఆలోచించి యూట్యూబ్​ వీడియోలు చేయడం ప్రారంభించారు.

ఈ యూట్యూబ్​ వీడియోలకు చాలా దేశాల్లో మంచి ఆదరణ లభించింది. వీటిని చూసిన ప్రతీ ఒక్కరు ఎంతగానో నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ అంటే వ్యతిరేకించే దేశాలు అయితే మరీనూ. అయితే ఈ జూనియర్​ కిమ్​ చేసే వీడియోలు కిమ్​ ను కించపరిచేలా ఉన్నాయని చాలామంది అభిప్రయపడ్డారు. దీంతో ఆయనకు వార్నింగ్ లు ఇచ్చారు. చంపేస్తామని బెదిరించారు. కాని అవన్నీ నాకు పట్టవు అని అంటున్నారు. అందుకే ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తున్నారంట. ఇది అసలు కిమ్ స్టోరీ.