Begin typing your search above and press return to search.
కేసీఆర్‌కు షాకిచ్చిన ముగ్గురు...అదే ఊపు కొనసాగిస్తారా?
By: Tupaki Desk | 14 Jan 2020 1:30 AM GMTతెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి అసలైన సవాలు మున్సిపల్ ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి దాదాపు 400 స్థానాల్లో అభ్యర్థులు కరువైపోగా అధికార టీఆర్‌ఎస్ పరిస్థితి మాత్రం అతివృష్టి అన్నట్లుగా ఉంది. అయినప్పటికీ... అందరి దృష్టి ప్రధానంగా ముగ్గురిపై పడింది. వారే బీజేపీ నేతలైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యమ్నాయమని చెబుతున్న కమలనాథులు.. పట్టణ ప్రాంతాల్లో తమకు పట్టు ఉందని ధీమా వ్యక్తం చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే, రాష్ట్ర నాయకత్వం ఊహించిన దానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల బీజేపీ తరపున నామినేషన్లే పడలేదు. మరోవైపు ఈ ముగ్గురు ఎంపీలున్న చోట చిత్రమైన పరిస్థితి ఉంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీరుపై రగిలిపోతున్న స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రస్థాయిు సమావేశం కొనసాగుతున్న సమయంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. జిల్లాలో పార్టీని నాశనం చేయడానికి అరవింద్ కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో గెలుపు పైనా పార్టీలో ఆశలు ఉన్నాయి. అయితే, మూడు మున్సిపాలిటీల్లో బీజేపీ బలంగా ఉంది. అయితే, ఆ పార్టీ తరపున చాలా చోట్ల ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేయడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. వీరిలో ఒకరికే బీ ఫారమ్ దక్కనున్నందున.. మిగతా వారిని ఏదోలా తప్పుకొనేలా చేసేందుకు ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజేపీ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి, టీఆర్ఎస్‌కు మధ్య పోటీ ఉండనుంది.
కీలకమైన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ తరఫున పోటీ చేసే నేతలు ఉన్నప్పటికీ, అక్కడ వారికి గెలుపు అంత ఈజీ కాకపోవచ్చునని అంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనందున ఈ నియోజకవర్గం పై టీఆర్ఎస్ సహజంగానే ఫోకస్ పెట్టింది. ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు టార్గెట్ సంజయ్ అన్నట్లుగా సాగుతున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సైడ్ అయిపోయి బీజేపీ-టీఆర్ఎస్ అన్నట్లుగా పురపోరు సాగుతోంది. మొత్తంగా, టీఆర్ఎస్ కు పరువు సమస్య గా మారిన పురపాలక ఎన్నికలు బీజేపీ కి ప్రధానంగా ఈ ముగ్గురు ఎంపీలకు సైతం అదే పరిస్థితి ని సృష్టిస్తున్నాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే వీరికి పార్టీలో దక్కే గుర్తింపునకు ప్రామాణికం కావచ్చునని చెప్తున్నారు. వీరిపై బీజేపీ పెద్దలు పెట్టుకున్న ఆశలు నెరవేరడంపై క్లారిటీ రావాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.