Begin typing your search above and press return to search.

మూడు రాజధానులేమో కానీ.. ఆర్కేకు పెద్ద తలనొప్పిగా మారిందే

By:  Tupaki Desk   |   23 Dec 2019 10:55 AM GMT
మూడు రాజధానులేమో కానీ.. ఆర్కేకు పెద్ద తలనొప్పిగా మారిందే
X
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయటం ద్వారా అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరగటంతో పాటు.. అన్ని ప్రాంతాలు క్రమపద్దతిలో డెవలప్ కావాలన్న ఆలోచన చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే.. తమ ప్రాంతం నుంచి రాజధాని వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అమరావతి రైతులు.

గడిచిన కొద్ది రోజులుగా వారు మూడు రాజధానులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఆందోళనలకు టీడీపీ చేయిస్తున్న వ్యూహాత్మక నిరసనలు తోడయ్యాయి. అమరావతి నుంచి రాజధానిని తరలించకూడదంటూ చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం స్పందింని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు తమ ఎమ్మెల్యే కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసక్తికరంగా మారింది. తమ ఎమ్మెల్యే కనిపించకుండా పోయారంటూ రాజధాని రైతులు పలువురు మండిపడుతున్నారు. తమకింత కష్టం ఎదురయ్యాక ఎమ్మెల్యే తమను పట్టించుకోవటం లేదంటున్నారు.

ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నది పూర్తిగా ముఖ్యమంత్రితో పాటు.. రాజధాని అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం కూడా ప్రభావితం చేయనుంది. ఇలాంటప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు చేయగలిగింది ఏమీ ఉండదు. కానీ.. ఈ విషయాన్ని రైతులు పట్టించుకోవటం లేదు. తమకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే నిలవటం లేదన్న కోపంతో ఉన్న రాజధాని ప్రాంత రైతులు తమ ఎమ్మెల్యే కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రాజధానులు ఏమో కానీ ఆర్కేకు ఇబ్బందిగా మారిందని చెప్పక తప్పదు.