Begin typing your search above and press return to search.

ఇవాంక సహాయకురాలికి కరోనా పాజిటివ్‌ !

By:  Tupaki Desk   |   9 May 2020 3:30 PM GMT
ఇవాంక సహాయకురాలికి కరోనా పాజిటివ్‌ !
X
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య 13.22 లక్షలు దాటగా.. దాదాపు 79వేల మంది మృత్యువాతపడ్డారు. తాజాగా అమెరికా అధక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక వ్యక్తిగత సహాయకురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వైట్ ‌హౌస్ ‌లో కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. కాగా గత కొద్ది రోజులుగా ఆమె ఇవాంక దగ్గరకు రాకపోవడంతో ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు.

లాక్ ‌డౌన్‌ ఆంక్షల కారణంగా ఇవాంకా సహాయకురాలు గత రెండు నెలలుగా ఫోన్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనీ.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైట్ ‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆమెలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. ఇవాంక సహాయకురాలికి కరోనా పాజిటివ్ గా రావడంతో ఇవాంక, ఆమె భర్త జరేడ్ కుష్‌ నర్‌ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. అయితే అధ్యక్షుడి భద్రత విషయమై ఆందోళన చెందనవసరం లేదని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. అధ్యక్ష భవనంలో పరిసరాలను డిసెనిఫెక్ట్ చేయడం, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించటం వంటి జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకుంటున్నామని వారు వివరించారు. అయితే ట్రంప్‌ మాత్రం వివిధ కార్యక్రమాలకు మాస్క్‌ ధరించకుండానే హాజరవుతుండటం గమనార్హం.