Begin typing your search above and press return to search.
విజయనగరంలో కరోనా విజృంభణ ... ఒకే రోజు ఎన్ని కేసులంటే ?
By: Tupaki Desk | 7 May 2020 10:10 AM GMTఏపీలో కరోనా వైరస్ ఉదృతి రోజురోజుకి పెరిగిపోతుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు చేయడం ప్రారంభించినప్పటి నుండి ప్రతి రోజు కూడా యావరేజ్ గా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 8,087 శాంపిళ్లను పరీక్షించగా 56 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,833గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 780 మంది డిశ్చార్జ్ కాగా, 38 మంది మరణించారని వివరించింది.
ఇకపోతే, మొన్నటివరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరోనా కేసులు బయటకి వచ్చినా కూడా ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.దీనితో దేశ వ్యాప్తంగా విజయనగరం గురించి చర్చ జరిగింది. అలాగే గ్రీన్ జోన్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. కానీ, గ్రీన్ జోన్ గా ఉన్న విజయనగరం జిల్లా ఒక్కసారిగా 3 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఉలిక్కిపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మరింత కట్టడి దిశగా ముందుకు వెళ్తున్నారు.
విజయనగరం జిల్లాలో అరవై సంవత్సరాల వృద్దురాలితో పాటు మరో ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్బా సోకింది. బాధితుల్లో ఇద్దరు వలస కూలీలు ఉన్నారు. గత నాలుగురోజుల క్రితం కృష్ణ జిల్లా నుంచి వీరు వచ్చారు. ఈ క్రమంలో బాధితుల కుటుంబసభ్యులను, వారితో ప్రయాణించిన వారిని క్వారంటైన్ కు తరలించారు. యాభై బృందాలను ఏర్పాటుచేసి మరింత లోతుగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.