Begin typing your search above and press return to search.
ముగ్గురు డిప్యూటీ సీంలు..ఇద్దరు హోం మంత్రులు
By: Tupaki Desk | 19 Nov 2018 5:36 AM GMTతెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిదే విజయం అని అటు సర్వేలు, ఇటు ఓటర్లు కూడా స్పష్టం చేస్తున్నా ప్రతిపక్ష మహాకూటమి మాత్రం అప్పుడే పదవుల పందారం ప్రారంభించేసింది. కాంగ్రెస్, తెలుగుదేశం వంటి పెద్ద పార్టీలతో పాటు పెద్దగా ప్రభావం లేని సిపీఐ, ఇప్పుడిప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణ జన సమితి కూడా పలు పదవులపై పట్టు పడుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్ధానాలు వస్తాయని తాము చేయించుకున్న సర్వేలు పేర్కొనడంతో ఈ పార్టీలన్నీ అప్పుడే ఏ ఏ పదవులు కావాలో కూడా లెక్కలు వేసుకుంటున్నాయట. ఇదే విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ‌్య కీలక చర్చలు కూడా జరిగినట్లు చెబుతున్నారు.
తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రధానమైన ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకే వదిలేయాలి కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఇక మిగిలిన మంత్రి పదవులను ఎలా పంచుకోవాలనే అంశంపై ముందుగా ఓ మాట కూడా అనుకున్నారని చెబుతున్నారు. ఢిల్లీలో జరిగిన చర్చలతో పాటు ఈ నెల 22 వ తేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడతారని అంటున్నారు. ఈ చర్చల ప్రకారం తెలంగాణలో ముగ్గురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉండే అవకాశాలున్నాయంటున్నారు. ఇందులో ఒకటి కాంగ్రెస్ పార్టీకి - మరొకటి తెలుగుదేశం పార్టీకి - ముచ్చటగా మూడోది తెలంగాణ జన సమితికి ఇవ్వాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మూడు పదవుల్లోనూ ఒకటి మైనర్టీ వర్గానికి చెందిన వారికి - మరొకటి బీసీ కులానికి చెందిన వారికి - మూడోది మహిళకు... అది కూడా అగ్ర కులానికి కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నందమూరి సుహాసినిని ఉప ముఖ్యమంత్రి చేయాలన్న చంద్రబాబు నాయుడి ఆలోచన కార్యరూపం దాలుస్తుందని అంటున్నారు.
ఇక మిగిలిన రెండు హోం మంత్రుల పదవుల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీకి మరొకటి తెలంగాణ జన సమితికి కేటాయించాలన్నది ఓ అవగాహనగా చెబుతున్నారు. ఇద్దరు హోంమంత్రులు అనేది చాలా అరుదైన విషయం. మహాకూటమిలో భాగస్వామి అయిన సీపీఐకి కూడా మంత్రివర్గంలో ఓ ప్రాధాన్యం ఉన్న శాఖకు మంత్రివర్గ కోటాలో కేటాయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఎన్నికలు జరగకముందే... ప్రచారం ప్రారంభించక ముందే.... ఫలితాలు రాకముందే... మంత్రివర్గంలో వాటాలు వేసుకుంటున్న మహాకూటమి రేపు నిజంగా అధికారంలోకి వస్తే ఎన్నాళ్లు మనుగడ సాగిస్తుందో చెప్పడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.