Begin typing your search above and press return to search.
ఏపీ హైకోర్టులో ముగ్గురు ప్రభుత్వ లాయర్ల మూకుమ్మడి రాజీనామా..
By: Tupaki Desk | 11 Jun 2020 3:30 AM GMTఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి వాదించే ముగ్గురు ప్రభుత్వ లాయర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం సంచలనమైంది. హైకోర్టులో వరుసగా జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుఫున పనిచేస్తున్న లాయర్లు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
ఇప్పటికే ఢిల్లీలోని సుప్రీం కోర్టులో నియమించుకున్న న్యాయవాదిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. తాజాగా హైకోర్టు లో ముగ్గురు న్యాయవాదులు రాజీనామా చేయడంతో మొత్తం నలుగురు ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు వైదొలిగినట్టు అయ్యింది. వీరు రాజీనామా చేయడం.. ఏపీ ప్రభుత్వం ఆమోదించడం కూడా వెంటనే జరిగిపోవడం గమనార్హం.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైకోర్టు లో, సుప్రీం కోర్టు లో ప్రభుత్వ నిర్ణయాలపై వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దాదాపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 60 తీర్పులు వచ్చినట్టు సమాచారం. నిన్నటి నిమ్మగడ్డ వ్యవహారంలోనూ ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తరుఫున కోర్టుల్లో బలంగా వాదనలు వినిపించడం లేదన్న భావన ప్రభుత్వంలో మొదలైంది.
ఇక ప్రభుత్వ నిర్ణయాల్లో జరుగుతున్న తప్పిదాలపై దృష్టి పెట్టని ఏపీ ప్రభుత్వం, న్యాయవాదులపై మాత్రం గట్టిగా ఒత్తిడి చేయడం వల్లే వారు రాజీనామా చేసినట్టు హైకోర్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది.