Begin typing your search above and press return to search.
కారెక్కనున్న ముగ్గురు గ్రేటర్ ఎమ్మెల్యేలు ?
By: Tupaki Desk | 9 Feb 2016 4:55 AM GMTగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కారు ఎక్కబోతున్నారని టీఆరెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే, ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఏ పార్టీకి చెందినవారు? అనే విషయంలో మాత్రం టీఆరెస్ వర్గాలు వివరాలు చెప్పడం లేదు. మంగళవారం లేదా బుధవారం సీఎం కేసీఆర్ ను వారు ఆయన అధికారిక నివాసంలో కలిసి టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
కాగా తెరాస ఇప్పటికే కాంగ్రెస్ - టీడీపీలను చాలావరకు ఖాళీ చేసింది. టీడీపీ గ్రేటర్ పరిధిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలుచుకున్నా వారిలో చాలామందిని టీఆరెస్ ఇప్పటికే ఎగరేసుకుపోయింది. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో టీఆరెస్ తిరుగులేని ఆధిక్యం సాధించడంతో మిగిలిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆరెస్ వైపే చూస్తున్నట్లుగా సమాచారం. టీడీపీ - కాంగ్రెస్ ల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు చేరుతారని వినిపిస్తున్నా ఎవరన్నది బయటకు పొక్కడం లేదు. అయితే... కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అందులో ఒకరని బలంగా ప్రచారం జరుగుతోంది. మిగతా ఇద్దరు ఎవరన్నది స్పష్టతరాలేదు.
గ్రేటర్ రిజల్ట్ చూసిన తరువాత అన్ని పార్టీలూ తెలంగాణలో ఆశలు వదులుకున్నాయి. దీంతో ఆయా నేతలు కూడా అధికార పక్షంలోకి చేరడమే బెటరన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఆ క్రమంలోనే టీఆరెస్ లోకి చేరికలు ఉంటాయని తెలుస్తోంది.