Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు కీలక బిల్లులు ఇవే !

By:  Tupaki Desk   |   10 Dec 2019 8:22 AM GMT
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు కీలక బిల్లులు ఇవే !
X
ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమై ..రెండో రోజు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రశ్నోత్తరాలతో సమయంలోనే సభ అట్టుడికిపోయింది. ప్రశ్నోత్తరాలకి ముందే వంశీ ని అసెంబ్లీ లో మాట్లాడటానికి సమయం ఇవ్వడంతో సభ లో పెద్ద దుమారం రేగింది. ఆ తరువాత తెల్ల రేష‌న్ కార్డుల‌కు స‌న్నబియ్యం స‌ర‌ఫ‌రా - అమరావ‌తికి గ్రీన్ ట్రిబ్యున‌ల్ అనుమ‌తులపై టీడీపీ స‌భ్యులు ప్రభుత్వానికి ప్రశ్నలకి మంత్రులు సమాధానం ఇచ్చారు.

ఇకపోతే ఈ రోజు ఉదయం రైతులకు గిట్టుబాటు ధరలపై ఇవాళ టీడీపీ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా చూస్తే మొదటి రోజు లాగే - రెండో రోజు లాగే వాడివేడీగానే సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులపై అధికార నాయకులు విమర్శలు…. అలాగే అధికార నాయకులు చేసిన తప్పిదాలపై టీడీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశ పెట్టింది. అందులో మొదటిది టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు - రెండోది మద్యం రేట్లు పెంచుతూ ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేస్తూ బిల్లు - మూడో బిల్లు పాఠశాల విద్య నియంత్రణ కమిషన్ చట్టంలో సవరణలు చేసిన బిల్లులను ప్రవేశపెట్టింది.