Begin typing your search above and press return to search.

అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురి మృతి, నలుగురికి గాయాలు

By:  Tupaki Desk   |   14 Jun 2022 10:31 AM GMT
అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురి మృతి, నలుగురికి గాయాలు
X
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లాస్ ఏంజెల్స్ లోని వేర్ హౌస్ లో ఈ ఫైర్ జరిగింది. కాల్పుల్లో ముగ్గురు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు. కాల్పులు జరిగిపన వ్యక్తికి కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాల్పులు ఎందుకు జరిపారనే అంశంపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. అక్కడ ఉండి చనిపోయిన ముగ్గురికి కాల్పులతో సంబంధం ఉందా? లేదా? అని పోలీసులు ఆరాతీస్తున్నారు.

కొందరు ఆగంతకులు వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్టు సాక్షులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. మరో వ్యక్తి గాయాలతో చనిపోయారు. డానియల్ డుంబార్(27), రాండీ టైసన్(25) ఇద్దరు చనిపోయారని లాస్ ఏంజెల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ తెలిపారు.

కాల్పులు చేసింది వీరేనని.. లేదా అనుమానాస్పద వ్యక్తులనేది పోలీసులు వెల్లడించలేదు. కాల్పుల తర్వాత ఆ ప్రాంతంలో రక్తం ఏరులైపారింది. ఘటనలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. నాలుగో వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

అమెరికాలోని గన్ కల్చర్ ఈనాటిది కాదు.. 1775 నుంచి వీటి వాడకం మొదలైంది. అప్పట్లో ఆఫ్రికన్ అమెరికన్లను బానిసలుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో తుపాకులు వాడడం మొదలుపెట్టారు. 1776లో ఇంగ్లాండ్ తో పోరాటం చేసి స్వాతంత్ర్యం సంపాదించుకున్న అమెరికా ఆ తరువాత అమెరికన్లు తమ భద్రత కోసం గన్స్ తో తిరిగేవారు.

అయితే అప్పటి నుంచి ఈ కల్చర్ కొనసాగుతోంది. అంతేకాకుండా 'వ్యక్తిగత భద్రత' అనే పేరు చెప్పి ప్రతి ఒక్కరూ గన్స్ ను కొనుగోలు చేస్తున్నారు. కొందరు భద్రత కోసం తుపాకులు కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు ప్రెస్టెజీ కోసం వాడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక గన్ ఉంటుంది.

అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆయుధాలను హక్కుగా భావిస్తారు. కొందమంది దీనిని వ్యతిరేకించినా వ్యక్తిగత భద్రత కోసం ఎక్కువ మంది సపోర్టు చేస్తున్నారు. 2020లో అమెరికాలో నిర్వహించిన 'గన్ కల్చర్ నియంత్రణ కోసం చట్టాలను కఠినతరం చేయడం అవసరమా..?'అనే సర్వేలో 52 శాతం మాత్రమే మద్దతు ఇచ్చారు. మిగతావారిలో 35 శాతం మంది చట్టాల్లో మార్పు చేయాల్సిన అవసరం లేదన్నారు. దీనిని బట్టి అమెరికాలో గన్ ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. గన్స్ అందుబాటులో ఉండడంతో చాలా మంది కోపంలో, ఉద్రేకాలు తట్టుకోలేక కాల్చి పడేస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు. గన్స్ వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.