Begin typing your search above and press return to search.

ముగ్గురు నేతలు.. మూడు పార్టీలు.. ఒకే కుటుంబం

By:  Tupaki Desk   |   14 July 2021 6:58 AM GMT
ముగ్గురు నేతలు.. మూడు పార్టీలు.. ఒకే కుటుంబం
X
సినీ ఇండస్ట్రీ అయినా.. రాజకీయాలైనా ఫ్యామిలీ ఫ్యామిలీలు మొత్తం రాజకీయం చేయడం కామన్ గా వస్తోంది. అయితే ఒకే పార్టీలో ఎదగడం రాజకీయాల్లో కామన్. కానీ తెలంగాణలోని ఈ అపర రాజకీయ ఫ్యామిలీ మాత్రం ఏకంగా మూడు పార్టీల్లో పదవులు అనుభవిస్తూ ఉండడం విశేషంగా మారింది.

తెలంగాణ రాజకీయాల్లోనే తెలివైన కుటుంబంగా ‘ధర్మపురి’ ఫ్యామిలీకి పేరుంది. తండ్రి, కుమారులు ముగ్గురూ మూడు రాజకీయ పార్టీలో ఉండడం విశేషం. రాజకీయాల్లోనే ఇదో అరుదైన దృశ్యంగా చెప్పొచ్చు.

తెలంగాణ రాజకీయాల్లోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు. వైఎస్ హయాంలో ఈయనే పీసీసీ చీఫ్ గా ఉండి కాంగ్రెస్ ను రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు.ఇక ఆయన చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ బీజేపీ నిజామాబాద్ ఎంపీగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ తాజాగా రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించాడు. దీంతో తండ్రి టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా.. అరవింద్ నిజామాబాద్ ఎంపీగా.. సంజయ్ కాంగ్రెస్ నేతగా ముగ్గురూ తెలంగాణలో మూడు పార్టీల్లో ఉండడం పెను సంచలనంగా మారింది.

ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణలోనే ఒకసీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. చాలాకాలంగా కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవిస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1998, 2004 సంవత్సరాల్లో పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ పనిచేశారు. 2004లో కాంగ్రెస్ ను ఏపీలో అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ తోపాటు డీఎస్ కృషి చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు.

కానీ 2014లో రాష్ట్ర విభజనతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. 2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. అతడి పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా తన తండ్రితోపాటు టీఆర్ఎస్ లో చేరాడు. డీఎస్ సీనియారిటీకి మెచ్చి కేసీఆర్ సైతం రాజ్యసభ సీటును ఇచ్చి గౌరవించాడు. అయితే కవితను నిజామాబాద్ లో తన కొడుకు అరవింద్ తో కలిసి ఓడించాని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో టీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నా.. ఆ పార్టీ ఎంపీగానే రాజ్యసభలో కొనసాగుతున్నాడు.

డీఎస్ తన కుమారుడు అరవింద్ గెలుపు కోసం నిజామాబాద్ లో కవితను ఓడించాడనే విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి గులాబీ బాస్ పార్టీ కార్యక్రమాలకు డీఎస్ ను దూరం పెట్టారు. అయితే టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ టికెట్ పొందిన డీఎస్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆ పార్టీలో చేరితే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వం పోతుందని భావించి అధికారికంగా కండువా కప్పుకోవడం లేదు. అప్పట్లో అమిత్ షాను కలిసినా బీజేపీలో చేరికపై మాత్రం నోరు మెదపడం లేదు.. డీఎస్ బీజేపీ కండువా కప్పుకుంటే రాజ్యసభ చైర్మన్ కు విషయం చెప్పి అతడిని అనర్హుడిగా ప్రకటిద్దామని కేసీఆర్ యోచిస్తున్నారు. కానీ కేసీఆర్ నే ముప్పుతిప్పలు పెట్టేలా డీఎస్ వ్యవహరిస్తున్నారు. బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటూ ఆ పార్టీలో మాత్రం అధికారికంగా చేరకుండా గులాబీ బాస్ ను విసిగిస్తున్నారు.

ఇక డీఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో చేరి నిజామాబాద్ ఎంపీగా పోటీచేసి ఏకంగా సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించారు. ప్రముఖ ఫైర్ బ్రాండ్ బీజేపీ నేతగా మారారు.

తాజాగా పరిణామంతో తండ్రి డీఎస్ ను ఓడించి ఆయన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. ఆ విధంగా తండ్రి, కుమారులు ఇద్దరూ ఒకే కుటుంబంలో ఉండి కూడా మూడు పార్టీల్లో కొనసాగడం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ రాజకీయాల్లోనే అత్యంత తెలివైన కుటుంబంగా కొనసాగుతోంది. తండ్రి కొడుకులు ఇలా ముగ్గురూ మూడు పార్టీల్లో ఉండడం విశేషంగా మారింది.