Begin typing your search above and press return to search.
పవన్... ఏదీ నైతికత !
By: Tupaki Desk | 8 July 2018 10:31 AM GMTపవన్ కల్యాణ్ .... ఒక ప్రభంజనం.......పవన్ కల్యాణ్ ..... ప్రేక్షకులకు దేవుడు.. అమ్మాయలకు కలల రాకుమారుడు... జనసేన నాయకుడు.... ఇదంతా నాణేనికి ఒక వైపు. ఆయన సిద్దంతాలకు మెచ్చి ఆయన అభిమానులు పవనిజమ్ అని ఆయనకు దాసులయ్యారు. ఇప్పటి వరకు రాజకీయలలోకి వచ్చి ఆయన ఏమి సాధించదలచుకున్నారో, ప్రజలకి ఏమి చేయదలచుకున్నారో ఆయనకే క్లారిటి లేదు.
మూడు పెళ్లిళ్లు చేసుకుని నీతులు వల్లిస్తున్న పవన్ కల్యాణ ఎంత నీతిమంతుడో అతని రెండో భార్య రేణూ దేశాయ్ వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితానికి - ప్రజా జీవితానికి సంబంధం లేదని మాటిమాటికి చెబుతున్నా మహాకవి శ్రీశ్రీ అన్నట్టు "వ్యక్తుల జీవితం వారి వారి ఇష్టం - పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం" అన్న కవిత్వం పవన్ కల్యాణ్ విషయంలో నిరూపితమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న పవన్ కల్యాణ్ ను ఆయన గత చరిత్ర వెంటాడుతూనే ఉంటుంది. రెండవ భార్య రేణుదేశాయ్ రెండో పెళ్ళికి పెద్ద మనసుతో పవన్ శుభాకాంక్షలు చెప్పినా అతనిపై పడ్డ మరక మాత్రం ఎప్పటికీ చెదరిపోదు. మరక మంచిదే అని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారేమో - అలాంటి మరకలు సినీ జీవితానికే తప్ప రాజకీయ జీవితాలకు మచ్చలాంటివే. రేణు దేశాయ్ నిశ్చితార్దం జరిగిన వెంటనే పవన్ కల్యాణ్ అభిమానుల వెర్రి రాతలు ప్రభావం ఆయన రాజకీయ జీవితంపై తప్పక పడుతుంది.
భార్యకు తెలియకుండా వేరొక అమ్మాయితో ఒక బిడ్డను కూడా కన్నట్లు పవన్ కల్యాణ్ పై రేణు వ్యాఖ్యానించిన నేపథ్యంలో అలాంటి నిందలు మోస్తున్న వ్యక్తి ఇతరుల నైతికత గురించి మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారని విమర్శకులు అంటున్నారు. " పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం వేరు ప్రజా జీవితం వేరు అనుకుంటున్నారు. మహానాయకుడు ఎన్.టి. రామరావు తన ప్రజా జీవితంలోకి లక్ష్మీపార్వతిని తీసుకుని రాగానే ప్రజల నుంచి ఎంత వ్యతిరేకతను తెచ్చుకున్నారో అందరూ చూసిందే." అని రాజకీయ విశ్లేకులు వ్యాఖ్యానించారు.
తన అన్న చిరంజీవి చెప్పినా వినకుండా చంద్రబాబు నాయకుడికి మద్దతు పలికానని ఇప్పుడు వాపోతున్న పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత జీవితానికి సంబందించి కూడా భవిష్యత్తులో ఇలాగే వాపోయే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి కూడా తన సభలకు వచ్చిన జన్నాన్ని చూసి తాను ముఖ్యమంత్రి కావడం ఖాయం అనుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే బ్రమలో ఉన్నట్టున్నారు. ఏ సినిమా నటుడు సభలు పెట్టినా ప్రజలు రావడం పరిపాటే. పవన్ కల్యాణ్ విషయంలోను తన అన్న చిరంజీవి కధే పునరావృతం అవుతుందేమో.