Begin typing your search above and press return to search.

పదమూడు మధ్యలో మూడు ప్రస్థావన...?

By:  Tupaki Desk   |   4 April 2022 6:28 AM GMT
పదమూడు మధ్యలో మూడు ప్రస్థావన...?
X
కొత్త రాజధానులు ఏపీలో ఏర్పాటు అయ్యాయి. ఒక విధంగా కొత్త ఏపీగా ఇపుడు రూపు మారింది. షేపు కూడా మారింది. వైసీపీ శ్రేణులకు ఒక పండుగ వాతావరణంగా కొత్త జిల్లాల ఏర్పాటుని మార్చారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు.

దానికి ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి ఇచ్చారు. ఏపీలో మారిన మ్యాప్, కొత్త జిల్లాల గురించి ప్రభుత్వం తరఫున అధికారులు వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఏపీ అధికార వికేంద్రీకరణ దిశగా మూడేళ్ళుగా అడుగులు వేస్తోంది అని పేర్కొన్నారు.

అందులో భాగంగా తొలి అడుగుగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇపుడు పదమూడు జిల్లాలను కాస్తా ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు అని వివరించారు. ఇక ఇదే స్పూర్తిగా మూడు ప్రాంతాలలో కూడా అధికార వికేంద్రీకరణ దిశగా సర్కార్ వేగంగా అడుగులు వేస్తుందని చెప్పుకున్నారు.

అయితే ఇది ప్రభుత్వం తయారు చేసిన నోట్ కాబట్టి మూడు రాజధానులు అన్న మాట రాకుండా జాగ్రత్త పడ్డారు. అదే టైం లో మూడు ప్రాంతాలుగా దాన్ని మార్చారు. ప్రాంతాలు అనుకున్నా మూడు అన్న మాట వచ్చింది కాబట్టి దాన్ని రాజధానులుగానే చెప్పుకోవాలి.

అంటే హైకోర్టు తుది తీర్పు వెలువడినా కూడా ప్రభుత్వం మూడ్ అయితే మారలేదు అనే చెప్పాలి. ఇప్పటికీ వైసీపీ మంత్రులు మూడు రాజధానుల ప్రసక్తి చేస్తూనే ఉన్నారు. అలాగే ఇపుడు పదమూడు కొత్త జిల్లాల ఆవిర్భావం వేళ కూడా మరో మారు మూడు అందులోకి వచ్చి చేరడం బట్టి చూస్తే సర్కార్ దృఢ సంకల్పం అన్నది అర్ధమవుతోంది.

మరి మూడు ప్రాంతాల అభివృద్ధి చేస్తామని చెప్పడం ద్వారా రాజధాని అన్న మాట లేకుండా పాలనను వికేంద్రీకరిస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కూడా న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకుంటేనే ఏదైనా సాధ్యపడేది. మొత్తానికి మూడు అంటూనే పదమూడు విషయంలో వైసీపీ సర్కార్ సక్సెస్ అయింది. మరి మూడు కల సాకారం అయ్యేది ఎపుడో చూడాలి.