Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లోన్ యాప్ కేసు: మరో ముగ్గురి అరెస్ట్

By:  Tupaki Desk   |   27 Dec 2020 5:30 PM GMT
ఆన్ లైన్ లోన్ యాప్ కేసు: మరో ముగ్గురి అరెస్ట్
X
కాల్ మనీ కంపెనీల ఆటకట్టవుతోంది. ప్రజలకు ఆన్ లైన్ యాప్ ల ద్వారా అప్పులు ఇచ్చి వారిని పీడించి చావులకు కారణం అవుతున్న సంస్థలపై పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్ లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కొరఢా ఝలిపించారు. లోన్ తీసుకున్న వ్యక్తులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.

లోన్‌ యాప్‌ కేసులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్‌ చేసినట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫూణేలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు పరుశురాంతోపాటు భార్య లియాంగ్ టియాన్,పరుశురాం అనుచరుడు షేక్ అకిబ్ లను అరెస్ట్ చేశారు. వారు 50శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.

లోక్ యాప్ కంపెనీ బ్యాంకు ఖాతాలకు చెందిన రూ.1.42 కోట్ల లావాదేవీలు నిలిపివేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నిందితుల నుంచి 101 ల్యాప్ ట్యాప్ లు, 106 సెల్ ఫోన్లు, సీసీటీవీలు, డీవీఆర్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీరు సృష్టించిన దాదాపు 14 నకిలీ లోన్ యాప్ లను గుర్తించారు. లోన్ యాప్‌ల వ్యవహారంలో ఇప్పటికే 24 మంది అరెస్టయ్యారు. నిందితులు లోన్స్ తీసుకున్న వారికి కాల్‌ సెంటర్ల ద్వారా ఫోన్లు చేయించి వేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.