Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ :తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు!
By: Tupaki Desk | 24 March 2020 8:35 AM GMTతెలంగాణలో తాజాగా మరో మూడు కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది. జర్మనీ నుంచి వచ్చిన హైదరాబాద్ లోని చందానగర్ కు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అలాగే సౌదీ అరేబియా నుంచి బేగంపేటకు వచ్చిన మరో మహిళకు కరోనా ఉన్నట్లు తేలింది. అలాగే లండన్ నుంచి వచ్చిన కూకట్ పల్లి వాసికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
అయితే , తెలంగాణ ప్రభుత్వం కరోనా పై యుద్ధ ప్రకటించి ..ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ..కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే , ప్రభుత్వం మాత్రం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ ఇండొనేషియా వాసులు పర్యటించిన ప్రాంతాల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ కు వెళ్లే - వచ్చే రహదారుల్లో ఐదు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇండొనేషియన్లు పర్యటించిన ప్రాంతాన్ని ప్రమాదకర జోన్‌గా ప్రకటించారు. ఆ జోన్ లోకి ఎవ్వరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. విదేశీయులతో పాటు వారితో సన్నిహితంగా ఉన్న 51 మందిని ఐసోలేషన్ కు తరలించారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో కాసేపట్లో సీఎం కేసీఆర్ భేటీ ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ కు ఇప్పటికే పలువురు అధికారులు చేరుకున్నారు. ఇక మరో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 500 దాటిపోయింది.