Begin typing your search above and press return to search.
బతకడం కోసం ‘మృత్యుఒడి’లో సాహస ప్రయాణం.. !
By: Tupaki Desk | 30 Nov 2022 3:30 PM GMTఆఫ్రికా దేశాల్లో వలసదారుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయనడానికి ఈ కింది ఫొటో ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఫోటోను స్పెయిన్ సముద్ర తీర రక్షణ శాఖ విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆఫ్రికా మూలాలు కలిగిన ముగ్గురు వలసదారులు బ్రతకడం కోసం మృత్యు ఒడిలో ప్రయాణించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ భారీ నౌకకు బయటివైపు ‘చుక్కాని’ అని పిలిచే ప్రమాదకర ప్రదేశంలో ముగ్గురు వలసదారులు కూర్చొని 11 రోజుల పాటు ప్రయాణించారు. ఇలా ప్రయాణించడమంటే చావునోట్లో తలపెట్టడమేనని అర్థమవుతోంది. సముద్రపు అలల తాకిడికి లేదా ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వీరి ప్రాణాలు అదే సముద్రంలో కలిసిపోవడం ఖాయమని మారిటైమ్ రెస్క్యూ టీమ్ చెబుతోంది.
ఈ ముగ్గురిని నౌకాశ్రయ సిబ్బంది గ్రాన్ కనారియా ద్వీపంలోని లాస్ పల్మాస్ కు నౌక చేరుకున్నాక గుర్తించి వారికి సహాయం చేశారు. రెస్క్యూ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారంగా ఆఫ్రికాకు చెందిన ఈ ముగ్గురు వలసదారులు నవంబర్ 17న నైజీరియాలోని లాగోస్ నౌకాశ్రయం నుంచి బయలుదేరారు.
మల్టా దేశపు జెండా కలిగిని అలిథిని-2 ఆయిల్ ట్యాంకర్ పై వీరు కూర్చొని ప్రయాణించారు. ఆ నౌకకు బయటివైపు చుక్కాని అని పిలిచే ప్రమాదకరమైన స్థలంలో 11 రోజులపాటు వీరు కూర్చుని ప్రయాణించినట్లు గుర్తించారు. వీరు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వీరి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నౌకాశ్రయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ముగ్గురిని నౌకాశ్రయ సిబ్బంది గ్రాన్ కనారియా ద్వీపంలో గుర్తించి ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వీరి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు గుర్తించి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 11రోజులపాటు ఎడతెరపి లేకుండా ప్రయాణించడం వల్ల వీరంతా డీహైడ్రేషన్ గురైనట్లు గుర్తించారు.
అయితే వలసదారులు ఇలా ప్రయాణించడం ఇప్పుడు కొత్తమీ కాదని స్పానిష్ జర్నలిస్ట్ టీమా సాంటానా పేర్కొన్నారు. ఇలాంటివి గతంలో చాలా జరిగాయని.. మున్ముందు కూడా ఇలాంటి సంఘటలు జరిగే అవకాశం ఉందని టీమా సాంటానా వివరించారు. బ్రతుకు దెరువు కోసం వలసదారులు చేసే ఇలాంటి సాహస ప్రయణాలు ఎల్లప్పుడు ఒకేలా ఉండవని ఆయన తెలిపారు.
ఇటీవలి కాలంలో పశ్చిమ ఆఫ్రికా నుంచి కానరీ ద్వీపాలకు పడవల ద్వారా వెళ్లే వారి సంఖ్య అధికంగా పెరిగింది. వీరి ప్రయాణాలు చాలా సుదీర్ఘంగా ఉండటంతో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇక ఈ మార్గంలో 2021లోనే 1532 మంది ప్రయాణిస్తూ మృత్యువాత పడినట్లు ఐక్యరాజ్య సమితి వలసల అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. ఏది ఏమైనా ఇలాంటి ప్రయాణాలు కాల్పనిక కథల్లో బాగుంటాయి తప్ప నిజ జీవితంలో మాత్రం చాలా ప్రమాదకరమని ప్రతీఒక్కరూ హెచ్చరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.