Begin typing your search above and press return to search.

మోడీ పెట్టుకున్న మూడు టార్గెట్లు

By:  Tupaki Desk   |   8 Aug 2022 6:00 AM GMT
మోడీ పెట్టుకున్న మూడు టార్గెట్లు
X
మోడీ ఔర్ ఏక్ పాల‌సీ అన్న‌విధంగా దేశంలో పాల‌న సాగుతోంది. వీటికి విమ‌ర్శ‌లు కూడా తోడ‌యి ఉన్నాయి. విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా కూడా మోడీ మాత్రం త‌న ప‌ని తాను చేసుకుని పోతున్నారు. ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (ప‌ర్యాట‌కం), టెక్నాల‌జీ (సాంకేతికం) అన్న‌వి ప్ర‌ధాన సూత్రాలుగా మోడీ కొత్త విధానం ఒక‌టి అవ‌లంబించేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు.

నిన్న‌టి నీతి అయోగ్ స‌మావేశంలో కూడా ఇవే చెప్పారు.వీటి కార‌ణంగా దేశం రానున్న మ‌రో ఇర‌వై ఏళ్ల‌లో మంచి ఫ‌లితాల‌నే అందుకోనుంద‌ని అంటున్నారాయ‌న‌. ఓ విధంగా ఆయ‌న లెక్క ప్ర‌కారం 2047 నాటికి మంచి లేదా సానుకూల ఫ‌లితాలు రానున్నాయి అని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. కానీ ఆ విధంగా దేశం ఉందా? లేదా అన్న‌దే ఇక్క‌డ కీల‌కం.

ఈ నేప‌థ్యంలో టూరిజం కు సంబంధించి తెలుగు రాష్ట్రాల‌లో ఉన్న పురోగ‌తి లేదా అధోగ‌తి అన్న‌వి ఏ విధంగా ఉన్నాయో చూడాలిక‌. రాష్ట్రం విడిపోయాక టూరిజం ప‌రంగా జ‌రిగిన అభివృద్ధి అంతా ఓ విధంగా హైదరాబాద్ కేంద్రంగానే ఉండిపోయింది. అదేవిధంగా రామోజీ లాంటి పెద్ద పెద్ద మీడియా శ‌క్తులు కూడా త‌మ ఫిల్మ్ సిటీల‌ను అక్క‌డే ఏర్పాటు చేసుకోవ‌డం భాగ్య‌న‌గ‌రికి ఓ అలంకారం అయింది.

ఆర్థిక చేయూత అయింది. అదేవిధంగా మిగిలిన కొన్ని అభివృద్ధి ప‌నులు కూడా తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రంగా చేప‌ట్టిన సంద‌ర్భాల్లో బాగానే ఫ‌లితాలు ఉన్నాయి.

హైద్రాబాద్ తో పోలిస్తే మ‌న ద‌గ్గ‌ర అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అంత అభివృద్ధి అన్న‌ది లేదని ఒక ఆరోపణ. విజ‌య‌వాడ, విశాఖ‌కు మంచి రోడ్లే ఇప్ప‌టికీ లేవు. రోడ్ క‌నెక్టివిటీ పెంచితేనే టూరిజం సెక్టార్ అభివృద్ధి అన్న‌ది సాధ్యం. అదేవిధంగా వాణిజ్య ప‌రంగా చూసుకున్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పెట్టుబ‌డిదారీ అనుకూల వాతావ‌ర‌ణం అంటూ ఏమీ లేదు అంటున్నారు.

అదేవిధంగా పారిశ్రామిక ప్రోత్సాహ‌కాలు అంటూ ఏమీ లేవట. ఇక సాంకేతిక ప‌రంగా హైద్రాబాద్ కూడా ఆశించిన స్థాయి క‌న్నా ఎక్కువే అభివృద్ధిలో ఉంది. కానీ ఇదే స‌మ‌యాన విశాఖ వెనుక‌బ‌డిపోయింది.క‌నుక మోడీ చెప్పిన‌ విధంగా రానున్న కాలంలో అభివృద్ధి నినాదం ఫ‌లితం ఇవ్వాలంటే ఏపీ సీఎం తీరులో ఓ మార్పు రావాల‌ని నిపుణులు అంటున్నారు. వ‌స్తుందో లేదో అన్న‌ది కాలమే చెప్పాలిక !