Begin typing your search above and press return to search.
బెంగళూరు డ్రగ్ రాకెట్ లో ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు
By: Tupaki Desk | 3 April 2021 4:37 AM GMTమరో షాకింగ్ పరిణామానికి సంబంధించిన ఏర్పాట్లు గుట్టుగా సాగిపోతున్నాయా? కర్ణాటకలో సంచలనంగా మారిన డ్రగ్ రాకెట్ వ్యవహారం తెలంగాణకు పాకింది. ఇప్పటికే పలువురు సినీ.. రాజకీయ ప్రముఖుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కన్నడ డ్రగ్ రాకెట్ లో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందన్న ప్రాథమిక సమాచారానికి పోలీసులు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ డ్రగ్ దందాలో చిన్నస్థాయి తెలుగు హీరోతో పాటు.. తెలంగాణ ఉద్యమ కారుడిగా చెప్పుకు తిరిగే నేతతో పాటు..ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేల పాత్ర స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు పోలీసులకు చిక్కిన డ్రగ్ సరఫరా ముఠా తీగను లాగితే.. తెలంగాణలోని డొంక కదిలినట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అనుమానితుల్ని అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
బెంగళూరు డ్రగ్ ఉదంతంలో సంబంధం ఉందని భావిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరై ఉంటారన్న విషయాన్నివెల్లడించేందుకు.. వారికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు పోలీసులు ససేమిరా అంటోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంచటం గమనార్హం. హైదరాబాద్ లో జరిగిన మత్తుమందు పార్టీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
తాను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని చెప్పే నేతకు డ్రగ్ దందాలో కీలకభూమిక ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటికే కీలకసమాచారాన్ని సేకరించిన పోలీసులు.. ప్రాథమిక ఆధారాల సేకరణలో తలమునకలై ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే నిందితుల్నిఅదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. నైజీరియాకు చెందిన హారిసన్.. జాన్ నాన్సోల్ని బెంగళూరు పోలీసులు పట్టుకోవటం.. వీరి నుంచి రూ.4కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిపిన విచారణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులతో లింకులు ఉన్నట్లుగా తేలింది. మరీ.. విషయాలు ఎప్పటికి బయటకు వస్తాయో చూడాలి.