Begin typing your search above and press return to search.

అతడొక్కడు.. అతనికి ముగ్గురు భార్యలు.. ఈ రియల్ స్టోరీ చాలా సిత్రం

By:  Tupaki Desk   |   22 Feb 2023 10:05 AM GMT
అతడొక్కడు.. అతనికి ముగ్గురు భార్యలు.. ఈ రియల్ స్టోరీ చాలా సిత్రం
X
ఒక భార్యతోనే వేగలేక చస్తుంటే.. ఇద్దరు భార్యలా? అంటూ ఫైర్ అయ్యేటోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు భార్యల మీద జోకులతో కాలం వెళ్లదీసే భర్తల్ని చూసినప్పుడు అయ్యోపాపం వీరికి ఇంతకు మించిన స్వేచ్ఛ ఇంకేం ఉంటుందన్న జాలిని ప్రదర్శిస్తుంటారు.

అయితే.. ఇదంతా ఒక లెక్క. ఇప్పుడు చెప్పేది మరో లెక్క. ఇప్పుడు చెప్పే ఉదంతం విన్న తర్వాత సదరు వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత లక్కీఫెలోలలో ఒకరిగా మీకనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంతకీ అతగాడి ప్రత్యేకత ఏమిటంటే..

ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు చెందిన నిక్ అనే కళాపోషకుడికి ముగ్గురు భార్యలు. ఒకరు తర్వాత ఒకరు చొప్పున ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్యను పెళ్లి చేసుకున్న వేళలో.. మిగిలిన ఇద్దరు భార్యల అంగీకారంతో చేసుకోవటం విశేషం.

ముగ్గురు భార్యల్ని ఒకే ఇంట్లో ఉంచి.. సంసార సాగరాన్నిఈదేస్తున్నాడు. తనను తాను ట్రోఫీ హజ్బెండ్ గా అభివర్ణించుకునే నిక్ సుడి ఏమంటే.. ఈ ముగ్గురు భార్యలు ఫుల్ టైం ఉద్యోగాలు ఉంటే.. అతడు మాత్రం ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తుంటాడు.

అందుకు తనను తాను రాజుగా చెప్పుకుంటాడు. చెస్ ఆటలో ఉండే రాజు.. ఎక్కడైనా.. ఎప్పుడైనా కష్టపడటం చూశారా?అని ప్రశ్నిస్తుంటారు. తన ముగ్గురు రాణుల్ని ఉద్యోగాలకు పంపి ఇంట్లో కులాశగా గడిపేస్తుంటారు. ఈ విషయంలో ఆ ముగ్గురు భార్యలకు ఎలాంటి అభ్యంతరం లేకపోవటం విశేషం. అతడి మొదటి భార్య ఏప్రిల్ తో అతనికి పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది.

తొమ్మిదేళ్ల క్రితం రెండో భార్యను జెన్నీఫర్ ను పెళ్లాడారు. మచ్చటగా మూడో భార్యను ఇద్దరు భార్యల సమ్మతితో మనువాడారు. పెళ్లి నాటికి మూడో భార్య డానియేల్ కు 22 ఏళ్లు మాత్రమే కావటం గమనార్హం.

ముగ్గురు భార్యలతో ఒకే ఇంట్లో ఉండటం ఇతనికి చాలా ఇష్టమట. ముగ్గురు భార్యల మధ్యలో ముద్దుల భర్తగా నిలబడి ఫోజులు ఇచ్చే ఇతను.. తన భార్యలతో దాంపత్యం మాత్రం ఇంట్లోని వేర్వేరు బెడ్రూంలలో చేస్తుంటారని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే ఒక కొడుకు ఉన్న నిక్ కు తాజాగా ఒక అమ్మాయి పుట్టింది. ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఈ తరహా వైవాహిక జీవితంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.