Begin typing your search above and press return to search.

మొబైల్ కు బానిసైన మూడేళ్ల పిల్లాడి కథ

By:  Tupaki Desk   |   10 Sep 2019 1:30 AM GMT
మొబైల్ కు బానిసైన మూడేళ్ల పిల్లాడి కథ
X
నిండా మూడేళ్లు ఉన్న పిల్లాడు మొబైల్ కు బానిస అయిపోయాడు.. దాదాపు ఏడు - ఎనిమిది గంటలు ఫోన్ పట్టుకొనే గేములు - యూట్యూబ్ వీడియోలు చూసేసరికి అతడికి వీపరీతమైన తలనొప్పి వచ్చేసింది. మూత్రం కూడా బంద్ అయిపోయింది. బాత్రూంకు వెళ్లి టాయ్ లెట్ పోస్తే వీడియోలు మిస్ అవుతానని ఆపుకోవడం కూడా ఆ బాలుడి పరిస్థితిని తీవ్రం చేసింది..

తాజాగా యూపీలోని రాయ్ బరేలీ జిల్లాలో ఓ మూడేళ్ల బాలుడిని సెల్ ఫోన్ పిచ్చి పీక్ స్టేజీకి వెళ్లింది. మొబైల్ లేనిదే ఉండలేని అతడి వ్యామోహానికి బెంబెలెత్తిపోయిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యుడితో కౌన్సిలింగ్ ఇప్పించారు. తన కొడుకును మొబైల్ ఫోన్ నుంచి విముక్తి చేయాలని డాక్టర్లను వేడుకున్నారట..

బాలుడు మొబైల్ ఫోన్ ను వదలడం ఇష్టంలేక మూత్రాన్ని ఒడిసిపట్టుకున్నాడనే అదే అతడిని అస్వస్థతకు దారితీసిదని డాక్టర్లు తేల్చారు. ఆ తర్వాత అనారోగ్యానికి బాలుడు గంటల తరబడి సెల్ ఫోన్ చూడడమే కారణమని తేల్చారు. సాధారణంగా 10-18 ఏళ్ల పిల్లలు ఇలా మొబైల్ కు అడిక్ట్ అవుతారని.. మూడేళ్లకే ఇలా బానిస కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోందని వైద్యులు తేల్చారు..

పిల్లలను బయట ఆడుకునేలా తల్లిదండ్రులు చూడాలని.. అవసరమైతే ఫోన్లలో గేమ్లు - యూట్యూబ్ లు రాకుండా డిలేట్ చేయాలని..లేదంటే పాత కీబోర్డ్ ఫోన్లు వాడితే బెటర్ అని వైద్యులు సూచించారు. పిల్లలకు ఫజిల్స్ - చెక్ - బ్లాకులు నిర్మించే తెలివిని పెంచే గేములు ఆడనివ్వాలని..ఆరుబయట పిల్లలతో కలిసిపోయే ఆటలు ఆడాలే ప్రోత్సహించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ వల్ల పిల్లలకు అనర్థమే తప్ప బాగుపడేది లేదని స్పష్టం చేస్తున్నారు. వాటికి ఎంత దూరంగా ఉంటే పిల్లల భవిత అంత బాగుంటుందని చెబుతున్నారు.