Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ రెండో టర్మ్ కు మూడేళ్లు.. మరి ఎన్ని మార్కులు..?
By: Tupaki Desk | 13 Dec 2021 2:30 PM GMTఅద్వితీయ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చి.. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేటికి మూడేళ్లు. చూస్తుండగానే సగ భాగంపైగా పదవీ కాలం అయిపోయింది. ఈ వ్యవధిలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటి టర్మ్ల్ (2014-18) లో మంచి పాలనతో మార్కులు కొట్టేసిన కేసీఆర్ సర్కారు మరి రెండోసారి ఎంతమేరకు రాణించింది? సవాళ్లను ఎలా ఎదుర్కొంది? భవిష్యత్తు ఎలా ఉండనుంది? మూడోసారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా?
ఎన్నికలలో గెలుపోటముల పల్టీ
ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. ఘన విజయంతో 2018 డిసెంబరులో రెండోసారి సర్కారు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్.. 2019 లోక్ సభ ఎన్నికల్లో అదే ఊపును చూపింది. నిజానికి అప్పటి పరిస్థితి చూస్తే.. కారు గుర్తుకు తిరుగులేదని అనిపించింది. దీనికితగ్గట్లే ‘సారు.. కారు పదహారు ’నినాదంతో టీఆర్ఎస్ ఎన్నికలను ఎదుర్కొన్నది. అయితే, వాస్తవంలో జరిగింది వేరు. 16 స్థానాలకు గురిపెడితే.. గెలిచింది 9.
అంతేకాదు సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, సన్నిహిత బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ పరాజయం పాలవడం పెద్ద షాక్. వీరిద్దరి స్థానాల్లో గెలిచిన ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ ఇప్పుడు బీజేపీలో రాష్ట్ర ప్రధాన నాయకులుగా ఎదిగారు. ఇక మల్కాజిగిరిలో మల్లారెడ్డి అల్లుడు, సికింద్రాబాద్ లో మంత్రి తలసాని కుమారుడు పరాజయం పాలవడం కూడా దెబ్బే. కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి
మల్కాజిగిరిలో గెలిచిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. సికింద్రాబాద్ లో గెలిచిన కిషన్ రెడ్డి కేంద్రంలో మంత్రి అయ్యారు. రాజకీయంగా తొలి 6 నెలల్లో టీఆర్ఎస్-2 సర్కారుకు తగిలిని ఎదురు దెబ్బలు ఇవైతే.. తర్వాత జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఘన విజయంతో కొంత నష్టాన్ని పూడ్చుకుంది. అయితే, దుబ్బాకలో దెబ్బపడింది. జీహెచ్ఎంసీలో అయితే ఏకంగా పరాజయం అంచుకు చేరింది. కానీ, నాగార్జున సాగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారుకు తిరుగులేకపోయింది.
కాగా, అనూహ్యంగా వచ్నిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాత్రం టీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఓటమి కంటే.. గెలిచేందుకు చేసిన ప్రయత్నాలు పూర్తిగా నీరుగారడం మరింత చెడ్డ పేరు తెచ్చింది. దుబ్బాకలో విజయం సాధించిన రఘునందన్ రావు, హుజూరాబాద్ లో గెలిచిన ఈటల రాజేందర్ కు తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్ష అనుబంధం ఉండడం టీఆర్ఎస్ కు భవిష్యత్ లో బీజేపీ నుంచి ఎదురుకానున్న గట్టి సంకేతం.
అసంతభృప్తా? వ్యతిరేకతా?
ఎంతలేదన్నా ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందన్నది వాస్తవం. అయితే రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి ఇది సహజం. 1994-2004 నాటి టీడీపీ, 2004-14 నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత చాలా తక్కువే నని చెప్పాలి. ఒకవిధంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రభుత్వంపై ఉన్నది అసంతభృప్తే కానీ వ్యతిరేకత కాదని భావించాలి.
అయితే, అసంతభృప్తే చివరకు వ్యతిరేకతకు దారితీస్తుందనే విషయం మరువకూడదు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం కూడా ఇప్పటికీ టీఆర్ఎస్ కు ఎదురులేకుండా చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పుంజుకొంటే.. అది త్రిముఖ పోటీకి దారితీస్తే పరిస్థితి ఎలా ఉంటుందో? చూడాలి.
పథకాలు పారుతాయా?
ఇది ఏటా రూ.20 వేల కోట్లు వెచ్చించాల్సిన హామీ. ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇది నెరవేరేదీ కష్టమే! ఎందుకంటే ఇప్పటికే రూ.2.38 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రం. నెలకు సగటున రూ.4050 కోట్లకు పైగా అప్పు చేస్తోంది. పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు హామీని.. రెండో విడతలోనూ నిలబెట్టుకోలేకపోయింది. ఏడున్నరేళ్లలో కట్టించిన ఇళ్లు నామమాత్రమే. సొంత జాగా ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు కేటాయిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనీ అమలు చేయలేదు.
ఎన్నికల హామీల్లో మరో ప్రధానమైన అంశం నిరుద్యోగ భృతి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3016 తి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రెండో విడత పాలనలోనూ ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారన్న లెక్కలు కూడా ప్రభుత్వం తీయలేదు. వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలున్నా.. వాటి భర్తీకి చర్యలు చేపట్టడంలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
పలువురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుండడం దీనిని ప్రతిపక్షాలు అంశంగా చేసుకుంటుండడం రాజకీయంగా ఇబ్బందికర వాతావరణం కల్పిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలుపు కోస దళిత బంధు అమలుతో బీసీ వర్గాల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి పెరిగింది. ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈబీసీలు... ఇలా అన్ని వర్గాలకూ ఇలాంటి పథకాన్ని తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. ఆర్థిక పరిస్థితిని చూస్తే సాధ్యమయ్యే అవకాశాలు ఎంతమాత్రం లేవని నిపుణుల అంచనా.
బీసీల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు వ్యయం చేస్తామని ప్రభుత్వం అంతకుముందే ప్రకటించింది. 50 శాతానికి పైగా ఉన్న బీసీల్లో ఈ హామీ ఆశలు నింపింది. కానీ, రిక్తహస్తాలే కనిపిస్తుండడం గమనార్హం. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి, కొని తెచ్చుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఇది అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా ప్రతిష్ఠాత్మకమై.. చిక్కులు తెచ్చిపెడుతోంది.
ప్రతి దళిత కుటుంబానికీ రూ.10లక్షల సహాయం చేసే పథకాన్ని ప్రకటించి.. హుజూరాబాద్ నియోజకవర్గానికి రూ.2000 కోట్లను కేటాయించారు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని సంతృప్త స్థాయి వరకు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ఇది జరగాలంటే రూ.1.75 లక్షల కోట్లు అవసరమవుతాయి. కానీ, ఇంత మొత్తంలో సర్కారు వద్ద నిధులు ఉంటాయా అంటే నమ్మశక్యంగా లేదని నిపుణులు అంటున్నారు.
ఉద్యోగుల నుంచి పీఆర్సీ సెగ
ఉద్యోగులకు పీఆర్సీ నివేదిక ఇచ్చినా.. అమలులో ప్రభుత్వం జాప్యం చేసింది. బకాయిల చెల్లింపు లోనూ ఉద్యోగుల అసంతృప్తికి కారణమైంది. 2018 జూలై తరువాత రిటైరైన వారికి పీఆర్సీని వర్తింపజేయలేదు. ఆసరా పింఛన్‌లకు అర్హతను 62 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పి.. పట్టించుకోలేదు. రైతుల పంట రుణాలను రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన టీఆర్‌ఎస్.. పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయింది. ఇప్పటివరకు రూ.50 వేల వరకు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి.. నాన్చుతూ వస్తున్నారు. ఇది గిరిజనుల్లో వ్యతిరేకతకు దారి తీస్తోంది.
సంకట స్థితిలోకి నెట్టిన ధాన్యం కొనుగోలు
వాస్తవానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక పరాభవాన్ని మరుగున పరిచేందుకు వ్యూహాత్మకంగా ధాన్యంకొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ కొనుగోళ్ల సమస్య టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. కేంద్రందే తప్పు అంటూ బాధ్యత నుంచి తప్పుకొనే ప్రయత్నం చేస్తుందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం రోజుకో నాటకమాడుతోందని ఆరోపిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని సమర్థించిన టీఆర్‌ఎస్.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని దూషిస్తోందని అంటున్నారు.
కేంద్రంతో మాట్లాడి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ చట్టాలు దుర్మార్గమని చెప్పి, తర్వాత అవే చట్టాలు రైతులకు మేలు చేస్తాయంటూ వ్యాఖ్యానించడాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ధోరణి కారణంగానే రైతుల్లోనూ వ్యతిరేకత పెరుగుతుందన్న విశ్లేషణలున్నాయి.
అప్పులే శరణ్యమా?
రూ.2,500 కోట్ల వరకు ఉన్న నెలవారీ వేతనాల పద్దు పీఆర్సీ అమలుతో ఏకంగా రూ.4 వేల కోట్ల వరకు పెరిగింది. వీటికి అదనపు నిధులను సర్దాల్సి వస్తోంది. నెలనెలా సంక్షేమ పథకాలకు నిధులను సర్దాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న ఒకే ఒక మార్గం... అప్పుల బాట. ఇప్పటికే ఈ ఏడాది రూ.28 వేల కోట్ల అప్పులు చేసింది. జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో మరో రూ.2వేల కోట్ల అప్పును సేకరించింది. నవంబరు, డిసెంబరు 10 నాటికి మరో రూ.4 వేల కోట్లకు పైగా అప్పు తీసుకున్నట్లు సమాచారం.
ఇవన్నీ కలిపితే రూ.34 వేల కోట్లవుతాయి. ప్రతి నెలా సగటున రూ.4050 కోట్లకుపైగా ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ప్రభుత్వ అప్పు ఇప్పటికే రూ.2.30లక్షల కోట్లు దాటి పోయిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పరిస్థితులతో ప్రభుత్వం రాబోయే రెండేళ్లు ఎలా నెట్టుకువస్తుందన్నది సవాలే.

ఇటీవల ప్రవేశపెట్టిన దళిత బంధు నుంచి గతంలోని ప్రత్యేక పథకాలు టీఆర్ఎస్ సర్కారుకు ముందుముందు సవాల్ గా మారే ప్రమాదం ఉంది. కొత్త పథకాలు నేల విడిచి సాము చేసినట్లుగా ఉండడమే దీనికి కారణం. ఇప్పటికే హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చని సర్కారు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధును తీసుకొచ్చింది.