Begin typing your search above and press return to search.

కూకట్‌పల్లి డిగ్రీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ .. ఓయో లాడ్జ్‌ ఘనకార్యమే !

By:  Tupaki Desk   |   16 Oct 2020 2:30 PM GMT
కూకట్‌పల్లి డిగ్రీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ ..  ఓయో లాడ్జ్‌ ఘనకార్యమే !
X
సంచలనం సృష్టిస్తున్న కూకట్‌పల్లి సామూహిక అత్యాచారం కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేక్‌లో మత్తు మందు ఇచ్చి యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. కూకట్‌పల్లిలో స్నేహం ముసుగులో యువతిని ముగ్గురు అత్యాచారం చేశారు. యువతిని జూబ్లీహిల్స్‌ కు చెందిన డిగ్రీ విద్యార్థిగా గుర్తించారు. బర్త్‌డే కేకులో మత్తు మందు కలిపి యువతిపై అత్యాచారం చేసినట్లు విచారణ తేలింది. విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ యువతిని యువకులు బెదిరించారు. బాధితురాలికి అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు నిలదీయండంతో జరిగిన విషయాన్ని ఆ యువతి చెప్పింది. నిందితులు జోసెఫ్‌, రాము, నవీన్‌పై పీఎస్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు.

బాధిత యువతి ఆసుపత్రిలో చేరిన తర్వాత కేసును జూబ్లీహిల్స్ పోలీసులు కూకట్‌పల్లికి బదిలీ చేశారు. నిందితులు జోసెఫ్‌, రాము, న‌వీన్‌ లపై కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే , ఈ ముగ్గురు తొలుత మైనర్లు అని వార్తలు వచ్చాయి , పోలిసుల విచారణలో ఆ ముగ్గురూ మేజర్లే అని తెలుస్తుంది. అయితే ,యువతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా కనిపించకుండా పోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జూబ్లిహిల్స్‌లో ఉండే అమ్మాయి సికింద్రాబాద్‌ లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతునట్టు తెలుస్తుంది. ఆమె ఇంటికి సమీపంలో ఉండే ముగ్గురు విద్యార్థులు ఆమెతో స్నేహం చేశారు. కాలేజీలో ఫీజు కట్టేందుకు వెళ్లిన సమయంలో ఆమెకు ఫోన్ చేసిన ఆ ముగ్గురు.. బర్త్‌డే పార్టీ అని చెప్పి బయటకు తీసుకువెళ్లి , ఆ తర్వాత కేక్ కటింగ్ అంటూ రూమ్ కి తీసుకువెళ్లి పథకం ప్రకారమే అత్యాచారం చేశారు.

ఈ ఘటనలో హోటల్‌ నిర్వాకం బయటకు వస్తోంది. అత్యాచారం జరిగిన హోటల్‌లో వివరాలు సేకరిస్తున్న పోలీసులు… సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఓయో హోటల్‌ నిర్వాకం వల్లే అమాయక యువతులపై కామాంధులు రెచ్చిపోతున్నారని సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురికీ ఓయో సిబ్బంది ప్రత్యేక గదిని కేటాయించినట్టు తెలిసింది. గతంలో లైగింక దాడి, హింసా ఘటనలు జరిగినా ఓయో యాజమాన్యం తీరుమారడం లేదు. యువతకు విచ్చలవిడిగా అద్దెకు గదులు ఇస్తున్నారు. దీనితో యువత కూడా ఇష్టానుసారంగా రెచ్చిపోతుంది. కూకట్‌పల్లిలోని ఓయో ఆనంద ఇన్‌ హోటల్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, నిబంధనలు పట్టించుకోకుండా ఎవరికి పడితే వారికి రూమ్‌లు కేటాయిస్తున్నారని స్థానికులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఓయో హోటల్ నిర్వాహకులను, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.