Begin typing your search above and press return to search.
ఉద్యోగుల విషయంలో త్రిముఖ వ్యూహం...?
By: Tupaki Desk | 27 Jan 2022 7:05 AM GMTవ్యూహాలు అన్నవి ఎపుడు విజయానికి తారక మంత్రాలు. అవి ఎపుడు ఎవరి మీద ప్రయోగించాలో తెలిసి ఉండాలి. అవసరమైనపుడు ఆ వ్యూహాలే గట్టెక్కిస్తాయి. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మొదట పీయార్సీని స్వాగతించారు. తరువాత వారు హెచ్ ఆర్ సీ విషయంలో అడ్డం తిరిగారు. ఆ మీదట ఎవరేమి చెప్పినా వినేది లేదంటూ ఆందోళన బాట పట్టారు.
దాంతో ప్రభుత్వం కూడా పట్టుదల మీద ఉంది. ముఖ్యాంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పీయార్సీ విషయంలో అంగీకరించడమే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆయనని పొగిడిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఆ తరువాత జగన్ ఫోటోలకు పాలాభిషేకాలు కూడా చాలా మంది చేశారు. అయితే ఇలా ఉద్యోగులు ప్రభుత్వం సామరస్యంగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేని వారే చిచ్చు పెట్టారని వైసీపీ అనుమానిస్తోంది.
అందులో టీడీపీ మీదనే అనుమానం ఉందిట. సరే ఆ సంగతులు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం కొత్త పీయార్సీ విషయంలో అనుకున్నట్లుగానే ముందుకు సాగాలని భావిస్తోంది. దీంతో ఉద్యోగుల విషయంలో సామరస్య ధోరణితోనే సాగాలని అనుకుంటోంది. అందుకే మంత్రులతో సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతీ రోజూ ఉద్యోగులను చర్చలకు పిలుస్తూనే ఉంటుంది. వారు రాకపోయినా కూడా మీడియా ముఖంగా రావలని కోరడం వెనక వ్యూహం ఉందని అంటున్నారు.
అదేంటి అంటే జనాల్లో ఉద్యోగులు చర్చలకు సిద్ధంగా లేరు అన్న సందేశాన్ని పండడమే అంటున్నారు. మరో వైపు చూస్తే కొత్త పీయార్సీ ద్వారానే జీతాలు ప్రాసెస్ చేయడం ద్వారా టెక్నికల్ గా ఉద్యోగులను ఒప్పించాలనుకోవడం. ఒకసారి కనుక జీతాలు కొత్త పే స్లిప్స్ తో తీసుకుంటే ఇక ఉద్యోగులు ఆందోళన చేసినా అర్ధం ఉండదు. కొత్త వేతనాలకు ఒప్పుకున్నట్లే అవుతుంది. ఈ ఎత్తుగడతోనే ప్రభుత్వం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది
ఇంకో విషయం తీసుకుంటే ప్రజలకు నేరుగా ప్రభుత్వం కొత్త పీయార్సీ విషయంలో వాస్తవాలను చెప్పడం అన్న మాట. ఈ విధంగా తాము ఉద్యోగులకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోవడం, ఆ విధంగా ఉద్యోగులకు జీతాలు పెంచినా కూడా ఆందోళనపధంలో వెళ్లడాన్ని జనమే తప్పు పట్టేలా పక్కా వ్యూహం అన్న మాట. మరి ప్రభుత్వ వ్యూహాలను అర్ధం చేసుకున్న ఉద్యోగులు కూడా ప్రతి వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. దాంతో రెండు వైపులా ఏర్పడిన గ్యాప్ అయితే ఎక్కువగానే ఉంది మరి. మరి అది ఏమీ లేకుండా సర్దుబాటుకు వస్తారా అన్నదే చర్చగా ఉంది మరి.